Allu Arjun Dowry: అ‍ల్లు అర్జున్‌ ఎంత కట్నం తీసుకున్నారంటే.. అసలు విషయం చెప్పేసిన స్నేహా రెడ్డి తండ్రి!

Allu Arjun Dowry. తాజాగా అల్లు అర్జున్‌ మామ, స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బన్నీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2022, 09:45 PM IST
  • అ‍ల్లు అర్జున్‌ ఎంత కట్నం తీసుకున్నారంటే
  • అసలు విషయం చెప్పేసిన స్నేహా రెడ్డి తండ్రి
  • వందకు వంద మార్కులు వేస్తా
Allu Arjun Dowry: అ‍ల్లు అర్జున్‌ ఎంత కట్నం తీసుకున్నారంటే.. అసలు విషయం చెప్పేసిన స్నేహా రెడ్డి తండ్రి!

Sneha Reddy father Chandrasekhar reveales How much dowry did Allu Arjun take: 'మెగా హీరో' అనే ట్యాగ్‌తో 'స్టైలిష్ స్టార్' అల్లు అర్జున్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మెగా ట్యాగ్ ప్రభావం ఎక్కడా కనబడనీయకుండా.. తన నటన, డ్యాన్స్‌తో ప్రేక్షుకులను అలరించారు. ఒక్కోమెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగారు. ప్రతి సినిమాలోనూ తనలోని కొత్త వేరియేషన్స్ చూపిస్తూ.. 'ఐకాన్ స్టార్' అయ్యారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంది. అయితే అ‍ల్లు అర్జున్‌కు సంబందించిన ఓ ఆసక్తికర విషయం బయటికొచ్చింది. 

అల్లు అర్జున్‌ తన సతీమణి స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రెండు కుటుంబాలను ఒప్పించి 2011లో బన్నీ, స్నేహ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వరుస సినిమా షూటింట్‌లతో ఎంత బిజీగా ఉన్నా.. బన్నీ ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. కొడుకు అయాన్, కూతురు అర్హతో సరదాగా గడుపుతారు. ముఖ్యంగా అర్హతో అతడికి ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అర్హతో గడిపిన మధుర మృతులను బన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. 

తాజాగా అల్లు అర్జున్‌ మామ, స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బన్నీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'మాకు అల్లు కుటుంబంతో అనుబంధం ఏర్పడక ముందే.. నాకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో ఇష్టం. నేను చిరు అభిమానిని. ఏదైనా ఫంక్షన్ జరిగితే నాకు ఆయన ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఇక అల్లు అర్జున్ చాలా మంచి వ్యక్తి. బన్నీకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అతడి సినిమా పాటలను జమ్మూ కశ్మీర్‌లో కూడా వింటున్నారు. ఇది అల్లు బన్నీ వర్క్‌తోనే సాధ్యమైంది' చంద్రశేఖర్‌ అన్నారు. 

'చిరంజీవి అడుగుజాడల్లో నడిచిన మెగా హీరోలు అందరూ ఎంతో ఎత్తుకు ఎదిగారు. అల్లుడిగా బన్నీకి వందకు వంద మార్కులు వేస్తా. పెళ్లి సమయంలో అల్లు అర్జున్ కట్నం తీసుకోలేదు. వాళ్లకే ఎక్కువ ఉంది. మనం ఇచ్చేది వాళ్లకి లెక్క కూడా కాదని నేను అనుకుంటున్నా. అల్లు ఫ్యామిలీ కట్నానికి వ్యతిరేకం' అని స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్‌ చెప్పారు. మొత్తానికి తన అల్లుడు బంగారం అంటూ చంద్రశేఖర్‌ ప్రశంసలు కురిపించారు. 

Also Read: MS Dhoni IPL Retirement: అలా చేస్తే.. చెన్నై అభిమానులు ఫీల్ అవుతారు! ఐపీఎల్ 2023లో ఆడుతా: ఎంఎస్ ధోనీ

Also Read: Vikram Telugu Trailer: పదా చూస్కుందాం.. సూర్యోద‌యాన్ని చూడ‌బోయేది ఎవ‌రో! విక్ర‌మ్ తెలుగు ట్రైల‌ర్‌ అదుర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News