Aha OTT: తమిళ్​లోనూ 'ఆహా' అనిపింపించాలని అల్లు అరవింద్​ ప్లాన్​!

Aha OTT: ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా.. మరో భాషలో స్ట్రీమ్​ సేవలు అందించేందుకు సిద్ధమైంది. త్వరలోనే సేవలు ప్రారంభం కానున్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2022, 11:10 PM IST
  • తమిళ ఓటీటి మార్కెట్ పై కన్నేసిన అల్లు అరవింద్
  • ఆహా తమిళ్ ఆవిష్కరణకు రంగం సిద్ధం
  • త్వరలోనే సేవలు ప్రారంభించాలని నిర్ణయం
Aha OTT: తమిళ్​లోనూ 'ఆహా' అనిపింపించాలని అల్లు అరవింద్​ ప్లాన్​!

Aha OTT: తెలుగు ఓటీటీ ప్లాట్​ ఫామ్​ ఆహా.. విస్తరణకు సిద్ధమైంది. కరోనా మొదటి దశ సంక్షోభం సమయంలో అందుబాటులోకి వచ్చిన.. 'ఆహా' జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఓటీటీ ప్లాట్​ఫామ్​లకు ధీటుగా కంటెట్ అందిస్తూ.. విజయవంతంగా ముందుకు సాగుతోంది.

సినిమాలతో పాటు.. స్పెషల్ షోలు, టాక్​ షోల వంటి వాటిని స్టీమింగ్​కు అందుబాటులో ఉంచుతోంది ఆహా ఓటీటీ. అన్​స్టాపబుల్ విత్​ ఎన్​బీకే వంటి షోలు 'ఆహా'ను మరింత మందికి చేరువ చేశాయనడంలో సందేహం (Aha OTT Shows) లేదు.

అయితే.. ఇప్పుడు ఇదే ఊపులో 'ఆహా తమిళ్​' ఓటీటీని ఆవిష్కరించేందుకు.. ఆహా నిర్వాహకులైన ప్రముఖ ప్రొడ్యూసర్​ అల్లు అరవింద్ (Allu Aravind on Aha OTT)​ సిద్ధమయ్యారు.

పొంగల్ 2022 సందర్భంగా 'ఆహా' తమిళ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఆహా తమిళ్​ ట్విట్టర్ హ్యాండిల్​ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించగా.. ఆ ట్వీట్​ను ఆహా తెలుగు ట్విట్టర్ హ్యాండిల్​లో (Aha Tamil) షేర్ చేశారు.

అయితే ఆహా తమిళ్​ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని అనే విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.

తెలుగులో అందించినట్లుగానే.. తమిళంలో కూడా సినిమాలతో పాటు.. ఒరిజినల్​, ఎక్స్​క్లూజివ్ షోలు ప్లాన్​ చేస్తున్నట్లు సమాచారం.

'ఆహా' గురించి..

'ఆహా' ఓటీటిని అర్హా మీడియా అండ్ బ్రాడ్​కాస్టింగ్​ ప్రైవేట్​ లిమిటెడ్​, (గీతా ఆర్ట్స్​ జాయింట్ వెంచర్​), మై హోం గ్రూప్​లు సంయుక్తంగా తీసుకొచ్చాయి. 2020 మార్చి 25న దీనిని ఆవిష్కరించారు. ప్రస్తుతం కేవలం తెలుగు కంటెంట్​ మాత్రమే అందుబాటులో ఉంది.

Also read: Sukumar Bollywood Offer: సుకుమార్​కు బాలీవుడ్ ఆఫర్- స్వయంగా కోరిన టాప్ హీరో!

Also read: Anasuya Sankranthi Celebrations: అనసూయ సంక్రాంతి సంబరాలు.. పార్కులో భర్తతో కలిసి.. !!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News