Allu Aravind Geetha Govindham గీత గోవిందం సినిమాకు సీక్వెల్ రాబోతోందనే రూమర్లు గత రెండ్రోజులుగా ఎక్కువగా వినిస్తున్నాయి. అయితే ఈ విషయం మీద ఎవ్వరూ క్లారిటీ ఇవ్వలేదు. కానీ దిల్ రాజు పరుశురామ్ విజయ్ కాంబోలో సినిమా రాబోతోందనే ప్రకటన వచ్చింది. దీంతో అది గీత గోవిందం సీక్వెల్ అని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే గీత గోవిందం సినిమాను నిర్మించింది గీతా ఆర్ట్స్ సంస్థ. ఒక వేళ దాని సీక్వెల్ తీయాలంటే ఆ సంస్థే తీయాలి. కానీ మధ్యలో దిల్ రాజు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అల్లు అరవింద్‌కు కాలిపోయినట్టుంది.
అందుకే ఈ రోజు ఓ ప్రెస్ మీట్ అనౌన్స్ చేశాడు. ఆ ప్రెస్ మీట్‌లో అల్లు అరవింద్ ఏం మాట్లాడాతాడా? అని అంతా ఎదురుచూశారు. కానీ చివరకు ఆ ప్రెస్ మీట్‌ను అల్లు అరవింద్ క్యాన్సిల్ చేసినట్టుగా తెలుస్తోంది. దిల్ రాజు టీం నుంచి అల్లు అరవింద్‌ను కొంత మంది కలిశారట. సర్దిచెప్పే ప్రయత్నం చేశారట.
ఇక పరుశురామ్ కూడా పర్సనల్‌గా వెళ్లి సారీ చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో అల్లు అరవింద్ కాస్త వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ మీద మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఒక వేళ విజయ్‌కి ఉన్న కమిట్మెంట్ల కారణంగా దిల్ రాజుతోనే సినిమా చేద్దామని పరుశురామ్‌కి చెప్పాడా? లేదా ఇది ఎవరి ఐడియా అన్నది తెలియాల్సి ఉంది.
మొత్తానికి అల్లు అరవింద్ కనుక ప్రెస్ మీట్ పెట్టి ఉంటే.. ఆయన మాటలు బయటకు వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని టాక్ వినిపిస్తుంది. మరి అల్లు అరవింద్ పూర్తిగా ఈ మ్యాటర్‌ను వదిలేస్తాడా? లేదంటే ఈ రోజుకు ఇలా శాంతించాడా? అన్నది చూడాలి. ఈ విషయం మీద ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.
అయితే దిల్ రాజు మాట మార్చడం, మీ బ్యానర్‌లోని దర్శకుడిని తాను ఎలా టచ్ చేస్తానని చెప్పి సాయంత్రానికే ప్రాజెక్ట్ ప్రకటించడంతో అల్లు అరవింద్ హర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇక దిల్ రాజుతో ఎప్పటికీ కలిసి పని చేసేది లేదని అల్లు అరవింద్ ఫిక్స్ అయినట్టు టాక్. బన్నీతో దిల్ రాజు సినిమా కూడా ఉండబోదని అర్థం అవుతోంది. విజయ్, పరుశురామ్ వంటి వారికి ఇక గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌లో ఎంట్రీ ఉండదని టాక్.
Also Read: Jr NTR Health Issue : ఎన్టీఆర్ ఆరోగ్యం బాగా లేదా?.. ఎందుకలా అన్నాడు.. అసలు ఏమై ఉంటుంది?
Also Read: Deepthi Sunaina : కొత్త ఇంటిని ఎలా కొన్నావ్?.. నెటిజన్ ప్రశ్నకు దీప్తి సునయన రిప్లై హైలెట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి