Alipiriki Allantha Dooramlo Movie Review : ప్రస్తుతం నేటివిటీతో తీసే కథ, కథనాలు జనాలను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. పుష్ప వంటి సినిమా కూడా నేటివిటీతోనే తీశారు. రాయలసీమ నేపథ్యం, చిత్తూరు యాస అందరికీ కనెక్ట్ అయింది. ఇప్పుడు అలిపిరి అంటూ తిరుపతిని టచ్ చేశారు. కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై నూతన నటుడు రావణ్ నిట్టూరు కధానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వీరంతా కలిసి చేసిన అలిపిరికి అల్లంత దూరంలో చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ
ఈ కథ అంతా కూడా తిరుపతిలో జరిగింది. మధ్య తరగతికి చెందిన వారది (రావణ్ నిట్టూరు) ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటాడు. దాంతో చిన్న చిన్న మోసాలు చేస్తూ దేవుడి చిత్రపటాలు అమ్మే షాప్ మెయింటైన్ చేస్తుంటాడు. గోశాలలో వాలెంటరీగా పని చేసే పెద్దింటి అమ్మాయి కీర్తి ( శ్రీ నికిత)ని చూసి ప్రేమిస్తాడు. ఈ విషయం కీర్తి తండ్రికి తెలుస్తుంది. దీంతో వారధికి వార్నింగ్ ఇస్తాడు. తన కూతురి వంక చూడొద్దని బెదిరిస్తాడు. దాంతో బాగా డబ్బు సంపాదించి కీర్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. అలాంటి సమయంలోనే వారధికి ఓ యాత్రికుడు కనిపిస్తాడు.
వెంకటేశ్వర స్వామికి 2 కోట్ల ముడుపుల మొక్కు చెల్లించుకోవడానికి ఆ యాత్రికుడు వస్తాడు. అతడి వద్ద నుంచి ఆ డబ్బు కొట్టేసి లైఫ్లో సెటిల్ అవుదామని ప్లాన్స్ వేస్తాడు. ఆ ప్లాన్ బెడిసి కొట్టేసి అనుకోకుండా చాలా విషయాల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడుతాడు. ఆ తరువాత వారధికి జరిగిన పరిణామాలు ఏంటి ? వెంకటేశ్వర స్వామి పాత్ర ఏంటి? ఆ యాత్రికుడి మొక్కు ఏమైంది? చివరకు తిరుమలలో షాప్ పెట్టి.. కీర్తిని పెళ్లి చేసుకోవాలనే కలను వారధి నెరవేర్చుకొన్నాడా లేదా? అన్నదే మిగతా కథ.
నటీ నటులు
రావణ్ నిట్టూరు తొలి సినిమాలో చక్కగా నటించాడు. అన్ని ఎమోషన్స్‌ను పలికించాడు. ఇక హీరోయిన్‌గా కీర్తి పాత్రలో శ్రీ నికిత ఉన్నంతలో మెప్పించింది. హోటల్ బిజినెస్ మెన్‌గా బొమ్మకంటి రవీందర్, ముడుపులు చెల్లించుకునే యాత్రికులుగా అమృత వర్షిణి సోమిశెట్టి , హీరోయిన్ కీర్తి తల్లి తండ్రులుగా జయచంద్ర, తులసిలు మెప్పించారు. వారధి తల్లి పాత్రలో లహరి గుడివాడ, హీరో తండ్రిగా వేణుగోపాల్, హరిదాసు పాత్రలో శతావధాని మురళి, హీరో ఫ్రెండ్ ఇలా అన్ని పాత్రలు బాగానే హైలెట్ అయ్యాయి.
విశ్లేషణ
డబ్బుల్లేకపోతే యువతకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి.. డబ్బు సంపాదించడం కోసం ఎలాంటి దారులు తొక్కుతారు అనే దానికి ఓ సింబాలిక్‌గా ఈ కథ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ రాబరీ డ్రామాలో భక్తిని కూడా జొప్పించడంతో కొత్తగా అనిపిస్తుంది. కొత్తవాళ్ళతో కూడా మంచి సినిమా తీయొచ్చని దర్శకుడు ఆనంద్ జె ఈ సినిమా ద్వారా నిరూపించాడు.
సినిమా చూస్తుటే అంతా తిరుపతి పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్స్‌లో తీశారు. సహజత్వం ఉట్టిపడేలా ప్రతీ సీన్, ఫ్రేమ్ అద్బుతంగా కనిపించింది. ఈ చిత్రంలో ప్రతి సీన్‌లో ఆ వేంకటేశ్వర స్వామీ రిఫరెన్స్ కనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఫణి కళ్యాణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.
కెమెరామెన్ డిజికె మంచి విజువల్స్ ఇచ్చారు. సత్య గిడుతూరి ఎడిటింగ్, నిర్మాతల రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్రలు పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. థ్రిల్లర్‌తో పాటు ప్యామిలీ ఎలిమెంట్స్‌తో డివైన్ టచ్ వున్న ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
రేటింగ్ : 2.75
Also Read : Gaalodu Movie Review : గాలోడు రివ్యూ.. సుధీర్ మాస్ యాంగిల్
Also Read : Masooda Movie Review : మసూద రివ్యూ.. భయపెట్టిన దెయ్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook