రణ్‌బీర్ కపూర్‌తో పెళ్లిపై స్పందించిన అలియా భట్

రణ్‌బీర్ కపూర్‌తో పెళ్లిపై అలియా భట్ స్పందన

Last Updated : Aug 14, 2018, 08:47 PM IST
రణ్‌బీర్ కపూర్‌తో పెళ్లిపై స్పందించిన అలియా భట్

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అలియా భట్, స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త గత కొద్ది రోజులుగా బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి బ్రహ్మస్త్ర సినిమాలో జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లోనే వీళ్లిద్దరి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లికి బాటలు వేయబోతోందనేది ఆ టాక్ సారాంశం. షూటింగ్‌లో మాత్రమే కాకుండా అనేక సందర్భాల్లో ఈ ఇద్దరూ కలిసి పార్టీలు, పబ్‌లకు వెళ్లడం చూశాకా వీళ్లిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకోనున్నారని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇదే విషయమై తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలియా భట్ స్పందించాల్సి వచ్చింది.

రణ్‌బీర్ కపూర్‌తో పెళ్లి వార్తలపై అలియా భట్ స్పందిస్తూ.. ''బయట రోజూ ఎన్నో పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. వాటన్నింటిపైనా స్పందించాల్సిన అవసరం తనకు లేదు'' అని తేల్చిచెప్పిందామె. మరి కెమెరా ముందు నటిస్తున్నప్పుడు ఈ పుకార్ల ప్రభావం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదా అని అడగ్గా.. ఒక నటిగా కెమెరా ముందు నటించడం తన వృత్తి. తాను తన వృత్తికి న్యాయం చేయడానికే ప్రయత్నిస్తాను కానీ ఎవరో ఏదో అన్నారని, దాని గురించే ఆలోచిస్తూ కూర్చొని వృత్తికి అన్యాయం చేయలేనని స్పష్టంచేసింది అలియా భట్. మరీ నా వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూడనంత వరకు తాను దేనిని అంతగా సీరియస్‌గా తీసుకోనంటోంది ఈ యంగ్ హీరోయిన్. 

అయితే, అలియా భట్ ఒక్క మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే.. 'ప్రస్తుతం తనకు రణ్‌బీర్‌కి మధ్య అంతా సజావుగానే ఉందని, ఆ విషయంలో తనకు ఏ ఇబ్బందీ లేద'ని అలియా భట్ వివరణ ఇచ్చింది. 

Trending News