Ranbir-Alia: రణబీర్, అలియా భర్తనైన నేను.. తోడు పెళ్లికూతుర్లకు వరుడి సంతకం!

Ranbir Kapoor chilling with Alia Bhatt bridesmaids. సోమవారం అలియా స్నేహితురాలు తాన్య సాహా గుప్తా.. బాలీవుడ్ లేటెస్ట్ కపుల్ రణబీర్, అలియాల పెళ్లి ఫోటోలను తన స్నేహితులతో పంచుకున్నారు. ఒక ఫోటోలో రణబీర్ తన చేతిలో ఒక నోట్‌ను పట్టుకుని కనిపించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2022, 08:44 PM IST
  • వివాహ బంధంతో ఒక్కటైన అలియా-రణబీర్
  • అలియా భర్తనైన నేను
  • తోడు పెళ్లికూతుర్లకు వరుడి సంతకం
Ranbir-Alia: రణబీర్, అలియా భర్తనైన నేను.. తోడు పెళ్లికూతుర్లకు వరుడి సంతకం!

Alia Bhatt bridesmaids handwritten letter to Ranbir Kapoor: బాలీవుడ్ ప్రేమికులు రణబీర్ కపూర్, అలియా భట్ వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వీరి వివాహ వేడుక ఫోటోలను వారి సన్నిహితులు, కుటుంబసభ్యులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సోమవారం అలియా స్నేహితురాలు తాన్య సాహా గుప్తా.. బాలీవుడ్ లేటెస్ట్ కపుల్ రణబీర్, అలియాల పెళ్లి ఫోటోలను తన స్నేహితులతో పంచుకున్నారు. ఒక ఫోటోలో రణబీర్ తన చేతిలో ఒక నోట్‌ను పట్టుకుని కనిపించాడు.

ఆ నోట్‌లో.. 'నేను రణబీర్, అలియా భర్తను. నేను తోడి పెళ్లికూతుర్లందరికీ ప్రతిజ్ఞ చేస్తున్నాను' అని రాసిన హామీ పత్రం కనిపించింది. ఇంతకీ రణ్‌బీర్.. అలియా స్నేహితులకు ఏం ప్రామిస్ చేశాడా అని ఇప్పుడు వారి అభిమానులంతా చర్చించుకుంటున్నారు. ఈ ఫోటోలు నిజంగా ఎంతో అద్భుతంగా ఉన్నాయి.  తాన్య వాటిని షేర్ చేస్తూ.. 'ఇలాంటి అద్భుతమైన రోజులు చాలా అరుదు. ఆనందబాష్పాలు, పొట్ట చెక్కలయ్యేలా నవ్వులు, అలియా ప్రేమను పండగలా చేసుకోవటం ఎంతో మధురమైన అనుభూతి. అలియాతో మాకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. 

తాన్యా సాహా గుప్తా పోస్ట్‌పై కొత్త పెళ్లి కూతురు అలియా భట్ స్పందించారు. 'సో క్యూట్' అంటూనే కొంత బాధను చూపించే ఎమోజీలు కూడా పోస్ట్ చేసారు ఆలియా. అలియా, రణబీర్ కపూర్‌లు ఏప్రిల్ 14 న ముంబైలోని రణ్‌బీర్‌ నివాసం వాస్తులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. వధూవరులు సబ్యసాచి డిజైన్ చేసిన పెళ్లి దుస్తులను ధరించారు. అలియా ఐవరీ చీర కట్టుకోగా, రణబీర్ మ్యాచింగ్ షేర్వాణీలో మెరిశాడు.

మరోవైపు అలియా భట్, రణబీర్ కపూర్ తమ పెళ్లి తర్వాత తిరిగి సినిమా పనులు ప్రారంభించారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర సినిమాలో అలియా భట్, రణబీర్ కపూర్ జంటగా కనిపించనున్నారు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించడం ఇదే తొలిసారి. బ్రహ్మాస్త్ర ఈ సెప్టెంబర్‌లో విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read: Allu Arjun: భారీ ఆఫర్‌ను తిరస్కరించిన అల్లు అర్జున్‌.. అసలు కారణం ఇదే!

Also Read: Kajal Agarwal: బాబుకి జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్.. ట్విట్టర్ లో హోరెత్తుతున్న విషెస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News