'నాగ్' కొత్త సినిమా లుక్ అదిరింది

నాగ్ తన సినిమాలో ఎలా కనిపించబోతున్నాడో వర్మ మూవీ స్టిల్స్ లాంచింగ్ సందర్భంగా రిలీజ్ చేసాడు. కాగా ఈ సినిమాలో నాగ్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలిసిందే.

Last Updated : Nov 20, 2017, 12:10 PM IST
'నాగ్' కొత్త సినిమా లుక్ అదిరింది

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ అక్కినేని నాగార్జునతో కొత్త సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే..! ఈ సినిమా కు సంబధించిన పూజా కార్యక్రమాలు కొద్దిసేపటి క్రితమే అన్నపూర్ణ సూడియోస్ లో గ్లాస్ హౌస్ లో ప్రారంభమయ్యాయి. దీనికోసం ఏకంగా చైనా సెట్ వేశారు. నాగార్జున అక్కినేని, వర్మ, వర్మ తల్లి, నిర్మాతలు వెంకట్ అక్కినేని, యర్లగడ్డ సురేంద్రతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. 

నాగ్ తన సినిమాలో ఎలా కనిపించబోతున్నాడో వర్మ మూవీ స్టిల్స్ లాంచింగ్ సందర్భంగా రిలీజ్ చేసాడు. కాగా ఈ సినిమాలో నాగ్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలిసిందే. తాజాగా నాగ్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ స్టిల్స్ రిలీజ్ చేసాడు. 28 ఏళ్ల కింద శివ సినిమా తన సినీ జీవితాన్ని మార్చిందని, మళ్ళీ ఇన్నేళ్లకు ఆ కాంబినేషన్లో ఈ సినిమా వస్తుందని.. ఈ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిదని పోస్ట్ చేసారు నాగ్. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ కూడా పేస్ బుక్ లో సినిమా కు సంబంధించి ఫొటోలు పోస్ట్ చేశారు. 

 

Trending News