Akkineni Nagarjuna: పుకార్లపై క్లారిటీ ఇస్తూ.. మన్మథుడి దీపావళి విషెస్

60 ఏళ్ల వయస్సులోనూ నవ మన్మథుడిగా యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తుంటారు.. కింగ్ నాగార్జున (Akkineni Nagarjuna). ప్రస్తుతం అక్కినేని నాగార్జున టాలీవుడ్ (Tollywood) రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ -4 కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Last Updated : Nov 14, 2020, 03:04 PM IST
Akkineni Nagarjuna: పుకార్లపై క్లారిటీ ఇస్తూ.. మన్మథుడి దీపావళి విషెస్

Akkineni Nagarjuna Diwali wishes: 60 ఏళ్ల వయస్సులోనూ నవ మన్మథుడిగా యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తుంటారు.. కింగ్ నాగార్జున (Akkineni Nagarjuna). ప్రస్తుతం అక్కినేని నాగార్జున టాలీవుడ్ (Tollywood) రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ -4 కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో నాగ్.. మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావును క‌లిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవికి (Chiranjeevi) క‌రోనా పాజిటివ్ అని ప్ర‌క‌టించ‌డంతో అటు ప్రభుత్వంలో.. ఇటు సినీ ఇండస్ట్రీలో ఆందోళన మొదలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బిగ్‌బాస్ షోకు నాగార్జున కొన్ని రోజులు దూరంగా ఉంటార‌ని ప్ర‌చారం జ‌రిగింది. 

ఆ తర్వాత నాగార్జున ఐసోలేష‌న్‌లోకి వెళ్లారని.. ఆయ‌న స్థానంలో బిగ్‌బాస్ షోకు ఆయన తనయుడు నాగ చైతన్య (Naga Chaitanya) వ‌స్తాడ‌ంటూ పుకార్లు వ్యాపించాయి. అయితే మళ్లీ జరిపిన కరోనా పరీక్షలో చిరంజీవికి నెగిటివ్‌గా తేలిందని తెలిసిందే. ఈ క్రమంలో.. బిగ్‌బాస్ షోకు నాగార్జున దూరంగా ఉంటారన్న వార్తలకు చెక్ పెడుతూ.. నాగ్ షో స్టేజ్‌పై దిగిన ఫొటోని షేర్ చేస్తూ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. Also read: Tamannaah: హాట్ లుక్‌తో ఆకట్టుకుంటున్న మిల్కీ బ్యూటీ

తాజాగా నాగార్జున చేసిన ట్విట్‌తో.. ఈ పుకార్లన్నింటిపై అంద‌రికి ఓ క్లారిటీ వ‌చ్చింది. అయితే ద‌స‌రా రోజు నాగర్జున రాకపోవడంతో సమంతా వచ్చి హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు హౌజ్‌మేట్స్‌తో సంద‌డి చేయ‌లేక‌పోయిన నాగ్.. దీపావళి రోజున సందడి చేయడం ఖాయంగా క‌నిపిస్తుంది.  Also read: Malavika Mohanan: అందంతో హీటెక్కిస్తున్న మాళవిక

Also read: Katrina Kaif: మాల్దీవుల్లో కత్రినా ఎంజాయ్.. ఫొటోలు చూశారా?

Also read: Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోస్తున్న రష్మీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe  

Trending News