Akkineni Chef : అక్కినేని అఖిల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. వంట మనిషి పోస్ట్ వైరల్

Akkineni Chef Kairavi Mehta అక్కినేని     అఖిల్ ఇప్పుడు ఏజెంట్ సినిమాతో సందడి చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అక్కినేని ఇంట్లో చెఫ్ గురించి కూడా వార్తలు వస్తూనే ఉంటాయి. చెఫ్ గురించి అక్కినేని వారు కూడా పోస్టులు వేస్తుంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2023, 07:01 PM IST
  • ఏజెంట్‌తో అఖిల్ సందడి
  • మూడ్రోజుల్లోనే ఏజెంట్ విడుదల
  • ట్రాన్స్‌ఫర్మేషన్ మీద చెఫ్ కామెంట్
Akkineni Chef : అక్కినేని అఖిల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. వంట మనిషి పోస్ట్ వైరల్

Akkineni Chef Kairavi Mehta అక్కినేని వారింట్లో సపరేట్‌గా చెఫ్‌లు ఉంటారన్న సంగతి తెలిసిందే. అక్కినేని వంట మనుషుల ఫోటోలు, వారి విషయాలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. ఏదైనా ప్రత్యేక సందర్భం ఉంటే స్పెషల్‌ వంటకాలు కూడా చేస్తుంటారు. వారి గురించి అమల ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా చెబుతుంటుంది. ఇక అఖిల్ సైతం తన వంట మనుషులతో ఎంతో ప్రేమగా ఉంటాడు. అక్కినేని వంట మనిషి కైరావి మెహత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.

అక్కినేని వారికి స్పెషల్‌గా వడ్డించే వంటకాల గురించి చెబుతుంటుంది. అయితే అఖిల్ ఈ ఏజెంట్ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. తొమ్మిది నెలల్లోనే ఈ రేంజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ సాధించడం అంటే మామూలు విషయం కాదని, అఖిల్ ఎంతగా కష్టపడ్డాడో తాను చూశాను అంటూ నాగార్జున స్టేజ్ మీద చెప్పిన మాటలు అందరికీ తెలిసిందే.

అయితే ఈ జర్నీలో అక్కినేని చెఫ్‌ల పాత్ర కూడా ఉంటుంది. ఎందుకంటే అఖిల్‌కు సరైన డైట్‌ను అందించడం, ప్లానింగ్ ప్రకారం డైట్ ఇవ్వడం కూడా ముఖ్యమే. ఈ జర్నీలో తాము కూడా ఉన్నందుకు ఎంతో సంతోషంంగా ఉందని అక్కినేని వంట మనుషులు వేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

వైల్డ్ థింకింగ్ నుంచి ఈ సినిమా పుట్టిందని, ఈ సినిమా వైల్డ్‌గా ఉంటుందని మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ఇక పాన్ ఇండియన్ ఆలోచనలు ఇప్పుడు మానేసినట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమా తెలుగు, మలయాళ భాషల్లో మాత్రమే రిలీజ్ అవుతోంది. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు.. ముందు తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేస్తామని, తరువాత పాన్ ఇండియాకు వెళ్తామని అఖిల్ పదే పదే తన ఇంటర్వ్యూల్లో చెబుతున్న సంగతి తెలిసిందే.

Also Read:  Payal Rajput Mangalavaram : నగ్నంగా పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్‌ఎక్స్ 100'ని మించి ప్లాన్ చేసిన అజయ్ భూపతి

ఈ సినిమాలో మమ్ముట్టి పాత్ర కీలకంగా ఉంటుందని తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం మాత్రం మమ్ముట్టి ముందుకు రావడం లేదు. ఈ మధ్యే మమ్ముట్టి తల్లి మరణించిన విషయం తెలిసిందే. అందుకే ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది

Also Read: Niharika Konidela : ఆమెతో కలిసి నైట్ సినిమా చూస్తూనే ఉందట.. ఎంజాయ్ చేస్తోన్న నిహారిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News