Samantha Myositis : అనారోగ్యంతో సమంత.. భరోసా నిచ్చిన అక్కినేని హీరోలు.. వెంకీమామ కూతురి కామెంట్‌ వైరల్

Akhil Akkineni Sushanth And Aashritha Daggubati అక్కినేని అఖిల్, సుశాంత్, వెంకీ మామ కూతురు ఆశ్రిత ఇలా అందరూ కూడా సమంత త్వరగా కోలుకోవాలి, ఆమె ఎంతో స్ట్రాంగ్ అంటూ కామెంట్లు పెట్టేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2022, 02:09 PM IST
  • అనారోగ్యంతో బాధపడుతున్న సమంత
  • కండరాల వ్యాధితో బెడ్డుపై సామ్
  • అండగా అక్కినేని హీరోలు
Samantha Myositis : అనారోగ్యంతో సమంత.. భరోసా నిచ్చిన అక్కినేని హీరోలు.. వెంకీమామ కూతురి కామెంట్‌ వైరల్

Samantha Myositis Disease : సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి వలన నీరసం రావడం, ఎక్కువ సేపు నిల్చోలేకపోవడం, నడవలేకపోవడం, అలసట వంటివి వస్తుంటాయి. ఒక వేళ వ్యాధి ముదిరితో శరీరంలోని భాగాల్లో వాపు కూడా వస్తుంది. కండరాల అసమతుల్యత వల్ల అనేక భాగాల్లో వాపు, నొప్పి కూడా వస్తుందట. అలా సమంత కనీసం తన పనులు తాను చేసుకోలేని స్థితిలో ఉందని అర్థమవుతోంది.

గత కొన్ని రోజులుగా సమంత చికిత్స తీసుకుంటోందట. కానీ ఈ విషయాన్ని ఇప్పుడు అందరికీ చెప్పేసింది. కానీ సమంతకు చర్మ సంబంధిత వ్యాధి సోకిందంటూ గతంలో రూమర్లు వచ్చాయి. దీనిపై సమంత మేనేజర్ కూడా స్పందించి.. ఖండించాడు. ఇక ఇప్పుడు సమంతకు మయోసైటిస్ అనే వ్యాధి రావడంతో అందరూ ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం డియర్ సామ్.. నువ్ చాలా స్ట్రాంగ్, త్వరగా కోలుకుంటావని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ వేశాడు.

ఇక అక్కినేని హీరోలు సైతం స్పందించారు. సమంతకు పోస్టులకు అఖిల్, సుశాంత్, వెంకీమామ కూతురు ఆశ్రిత వంటి వారు కామెంట్లు పెడుతుంటారన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సమంత ఇలాంటి పరిస్థితుల్లో ఉందని తెలియడంతో అందరూ స్పందించారు. నీలో నీకు తెలియనంతా గొప్ప శక్తి ఉంది.. నీ కోసం అనంతమైన ప్రేమను పంపుతున్నాను అంటూ ఆశ్రిత కామెంట్ పెట్టేసింది.

అదే సమయంలో అఖిల్ ఇలా అన్నాడు.. ప్రపంచంలోని శక్తి, సత్తా, ప్రేమ అంతా కూడా నీకు రావాలి డియర్ సామ్ అంటూ రెడ్ హార్ట్ సింబల్‌ను షేర్ చేశాడు. ఇక సుశాంత్ కామెంట్ పెడుతూ.. శక్తి, బలం అంతా నీదరికి చేరాలి.. నువ్ దీన్ని అధిగమించగలవ్ సామ్ అని అండగా నిలిచాడు. వీరితో పాటుగా.. కృతి సనన్, జాన్వీ కపూర్, కియారా అద్వాణి, రాశీ ఖన్నా, హన్సిక, లక్ష్మీ మంచు ఇలా అందరూ కూడా స్పందించారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

Also Read : Puri Jagannadh Open Letter : పూరి భార్యాపిల్లల ఫోటోలు షేర్ చేసిన బండ్ల గణేష్.. ఓపెన్ లెటర్ మీద బండ్లన్న ట్వీట్

Also Read : Bigg Boss Galata Geetu : ఇవే తగ్గించుకుంటే మంచిది.. ఓవర్ యాక్షన్ కంటెస్టెంట్.. నాగార్జున అన్నట్టుగా గీతూ కాదు పీతే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News