Ajay Devgn: తెలుగు సినిమా రీమేక్ రైట్స్ కొన్న అజయ్ దేవ్‌గన్

టాలీవుడ్ సినిమాలను చూసి బాలీవుడ్ ప్రముఖులు ఇన్‌స్పైర్ అవుతున్నారనడానికి మరో ఉదాహరణ తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ ఓ తెలుగు సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు రెడీ అయ్యాడు.

Last Updated : Dec 17, 2020, 09:38 PM IST
Ajay Devgn: తెలుగు సినిమా రీమేక్ రైట్స్ కొన్న అజయ్ దేవ్‌గన్

టాలీవుడ్ సినిమాలను చూసి బాలీవుడ్ ప్రముఖులు ఇన్‌స్పైర్ అవుతున్నారనడానికి మరో ఉదాహరణ తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ ఓ తెలుగు సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు రెడీ అయ్యాడు. శ్రీవిష్ణు, సత్యదేవ్, నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన క్రైమ్ కామెడీ బ్రోచేవారెవరు మూవీపై కన్నేసిన అజయ్ దేవ్‌గన్ ఆ చిత్రానికి సంబంధించిన హిందీ రీమేక్స్ రైట్స్ దక్కించుకున్నాడు.

వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం గతేడాదే ఆడియెన్స్ ముందుకొచ్చింది. బ్రోచేవారెవరురా మూవీలో శ్రీవిష్ణు, సత్యదేవ్ పోషించిన పాత్రల కోసం అభయ్ డియోల్, కరణ్ డియోల్‌లను ఎంపిక చేసుకున్న అజయ్ దేవ్‌గన్ ( Ajay Devgn ).. ప్రస్తుతం దర్శకుడి కోసం అన్వేషిస్తున్నాడు. 

Also read : Adivi Sesh: మేజర్ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది

ప్రస్తుతం హైదరాబాద్‌లోనే షూటింగ్ జరుగుతున్న మే డే చిత్రంతో ( May day movie ) బిజీగా ఉన్న అజయ్ దేవ్‌గన్.. ఆ తర్వాత ది బిగ్ బుల్, త్రిభంగ చిత్రాలను కూడా నిర్మించనున్నాడు. ఇవేకాకుండా ఆర్ఆర్ఆర్ మూవీతో (  RRR movie ) తొలిసారిగా ఓ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్న అజయ్ దేవ్‌గన్ చేతిలో సూర్యవంశి, మైదాన్ చిత్రాలు కూడా ఉన్నాయి.

Also read : Jr NTR's remuneration: ఒక్క టీవీ షో కోసం ఎన్టీఆర్‌కి ఇస్తోన్న పారితోషికం ఎంతో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News