‘అజ్ఞాతవాసి’ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్..!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రంపై అభిమానుల అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల అయ్యింది.

Last Updated : Dec 17, 2017, 06:07 AM IST
‘అజ్ఞాతవాసి’ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్..!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రంపై అభిమానుల అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల అయ్యింది. “మధురాపురి సదనా, మృదు వదనా, మధు సూధనా, ఇహ స్వాగతం కృష్ణా” అన్న కృతితో సాగే ఈ టీజర్‌లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ హైలట్ అని ఇప్పటికే ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

ఈ సినిమా టీజర్ విడుదలైన ఒక్క రోజులోనే దాదాపు 3 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించుకోవడం గమనార్హం. పవన్ కళ్యాణ్ సరసన అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రానికి, తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన రెండు ప్రమోషనల్ పాటలకూ మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ మూవీ ఆడియో వేడుక ఈ నెల 19న హైదరాబాద్‌లో జరగనుంది.

 

Trending News