అజ్ఞాతవాసి స్టిల్స్ వైరల్

పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్ జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే 'అజ్ఞాత‌వాసి'.

Last Updated : Dec 8, 2017, 09:14 PM IST
అజ్ఞాతవాసి స్టిల్స్ వైరల్

పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్ జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే 'అజ్ఞాత‌వాసి'. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పలు స్టిల్స్ బయటకు వచ్చాయి. అందులో ప్రధానంగా ఓ స్టిల్ పవన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అమాయకంగా మొహం పెట్టుకున్న పవన్‌ను..కీర్తిసురేష్ బుగ్గలు లాగుతూ ముద్దు చేయడాన్ని చూస్తూ.. ఈ జంట మంచి హిట్ పెయిర్ అవుతుందని ఇప్పటికే కితాబు ఇచ్చేస్తున్నారు అభిమానులు.

ఇటీవలే 'అజ్ఞాత‌వాసి' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజైంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాక్రిష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఖుష్బూ, బొమన్ ఇరానీ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 10, 2018 తేదిన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

Trending News