Alia Bhatt:: మొన్న రష్మిక.. నిన్న కాజోల్.. నేడు ఆలియా.. ఆగని డీప్ ఫేక్ వీడియోలు..

Deep fake videos: ఈమధ్య సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోలు విచ్చలవిడిగా హల చల్ చేస్తున్నాయి. వీటి పైన కేంద్రంతో సహా ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆకతాయిల వికృత చేష్టలు మాత్రం ఆగటం లేదు. మొన్న రష్మిక మందాన.. నిన్న కాజోల్ దీప్ ఫేక్ వీడియోలు రిలీజ్ చేసినట్టు.. ఈరోజు ఆలియా భట్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ కావడంతో అది కాస్త వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2023, 09:26 AM IST
Alia Bhatt:: మొన్న రష్మిక.. నిన్న కాజోల్.. నేడు ఆలియా.. ఆగని డీప్ ఫేక్ వీడియోలు..

Alia Bhatt Deep fake video: 

టెక్నాలజీ పెరిగే కొద్దీ కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి అని అప్పట్లో ఎంతోమంది శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. కాగా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఇది నిజం అనిపించక మానదు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక టెక్నాలజీ  వాడుకలో విచ్చలవిడితనం ఎక్కువ అయిపోతుంది. ప్రతి కాయిన్ కి బొమ్మ బొరుసు ఉన్నట్టు.. టెక్నాలజీలో కూడా మంచి.. ఉంది చెడు ఉంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియోలు టెక్నాలజీ లోని డేంజర్ సైడ్ కి చిహ్నాలుగా నిలుస్తున్నాయి…

టెక్నాలజీని చెడుగా వాడే వారు మన చుట్టూ లేకపోలేదు. తాజాగా డీప్ ఫేక్ వీడియోలు టెక్నాలజీని ఎంత చెడుగా వాడొచ్చు అనేదానికి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. కొన్ని అస్లీల వీడియోలకి ఆ వీడియోలతో సంబంధం లేని అమ్మాయిలు మొహాలు పెట్టి కొంతమంది ఆకతాయిలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సాధారణమైన అమ్మాయిలది ఒక పరిస్థితి అయితే అదే పరిస్థితి సెలబ్రిటీలకు జరిగితే ఇంక మన జనం ఊరుకుంటారా. కేంద్ర మంత్రి దగ్గర నుంచి సినిమా హీరో వరకు వాటిపైన స్పందిస్తూ ఉంటారు. అలానే జరిగింది ఈమధ్య రష్మిక మందాన దీప్ ఫేక్ వీడియో. ఒక వీడియోకి రష్మిక మొహం పెట్టి షేర్ చేయడంతో ఎంతోమంది ప్రముఖులు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాళ్ల మీద తగిన చర్యలు తీసుకోవాలని సాధారణ ప్రజలు అలానే ప్రముఖులు తమ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశారు. కేంద్రం కూడా ఆ వీడియో 24 గంటల్లో సోషల్ మీడియాలో ఉండకూడదు అని ఆర్డర్ పాస్ చేసింది. కాగా కొద్ది రోజుల తర్వాత మళ్లీ షరా మామూలే అన్నట్టు బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ వీడియో కూడా వైరల్ కావడం మొదలుపెట్టింది. అప్పుడు మళ్లీ అదే  ధోరణ.. అందరూ ఆగ్రహం వ్యక్తం చేయడం.. ఆ వీడియో తీసేయాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం.. కానీ అక్కడితో కూడా ఆగలేదు…ఇప్పుడు మళ్లీ అలియా భట్ విషయంలో ఇదే రిపీట్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ ఆలియా భట్ దీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల చల్ చేస్తోంది.

ఈ వీడియోలో కూడా ముందు చెప్పిన హీరోయిన్స్ విషయంలో జరిగిందే మళ్లీ రిపీట్ అయింది. అలియా భట్‌ను బోల్డ్‌గా చూపించే ప్రయత్నం చేశారు. వీడియో చూడగానే మనకు అది డీప్ ఫేక్ వీడియో అని అర్ధమవుతుంది.  వీడియోలో కనిపించిన అమ్మాయి ఎవరు? అనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు.  ఇక ఇప్పుడు మల్లా దీనిపై ఆలియాభట్ అలానే ప్రముఖులు  స్పందించాల్సి ఉంది. మరోవైపు డీప్ ఫేక్ వీడియోలను చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఇప్పటికైనా వీటిని అరికట్టడానికి సీరియస్ నిర్ణయం ఏదైనా తీసుకుంటుందేమో చూడాలి.

Also Read: BRS-BJP Alliance: హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్-బీజేపీ పొత్తు ఉంటుందా, అమిత్ షా ఏమంటున్నారు

Also Read: AB De Villiers Team: ఏబీ డివిలియర్స్ దృష్టిలో బెస్ట్ ప్రపంచకప్ టీమ్ ఇదే

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News