Adivi Sesh - Nani : HIT 3 గురించి చెబితే పరిగెత్తుకుంటూ వచ్చి నాని కొడతారు.. అడివి శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

HIT 2 Trailer out హిట్ రెండో పార్ట్ ట్రైలర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు అడివి శేష్ ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2022, 05:18 PM IST
  • ఆసక్తికరంగా HIT 2 ట్రైలర్
  • మూడో పార్ట్ మీద ఇంట్రెస్టింగ్ న్యూస్
  • నాని కొడతాడేమోనన్న అడివి శేష్
Adivi Sesh - Nani : HIT 3 గురించి చెబితే పరిగెత్తుకుంటూ వచ్చి నాని కొడతారు.. అడివి శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Adivi sesh Nani HIT 3 : నాని నిర్మాతగా వాల్ పోస్టర్స్ మీద శైలేష్ కొలను తీసిన హిట్ ఫస్ట్ కేస్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు హిట్ సెకండ్ కేస్‌కు సంబంధిచిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌తో డిసెంబర్ 2న రాబోతోన్న ఈ మూవీపై మరింతగా అంచనాలు పెరిగాయి. అయితే ఇప్పుడు హిట్ థర్డ్ కేస్‌కు సంబంధించిన అప్డేట్ వైరల్ అవుతోంది. మామూలుగా అయితే ఈ మూడో పార్టులో నాని, విజయ్ సేతుపతి, అడివి శేష్ వంటి వారు కనిపించబోతోన్నారట. అమెరికా బ్యాక్ డ్రాప్‌లో ఉండనున్నట్టు తెలుస్తోంది.

ఇదే విషయం మీద మీడియా నుంచి అడివి శేష్‌కు ప్రశ్న ఎదురైంది. హిట్‌ 3 గురించి ఇప్పుడు నేను ఏదైనా చెబితే.. దసరా సెట్ నుంచి నాని గారు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కొడతారు అని నవ్వేశాడు. అయితే మూడో కేసును మాత్రం భారీ ఎత్తున నిర్మిస్తున్నామని, త్వరలోనే అప్డేట్ ఇస్తామని, ప్రస్తుతానికి అయితే రెండో కేస్‌ను ఎంజాయ్ చేద్దామని దర్శకుడు శైలేష్ కొలను అన్నాడు.

ఇంతలో అడివి శేష్ అందుకుని మూడో కేస్ గురించి రేపు ట్వీట్ చేద్దామని అన్నావ్ కదా? అంటూ అడివి శేష్ ఆట పట్టించాడు. మరి ఈ మూడో కేస్‌ అంటే హిట్ 3 సినిమాకు సంబంధించిన అప్డేట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి. లేదంట్ హిట్ 2 క్లైమాక్స్‌లోనే ఏదైనా హింట్ ఇస్తారా? అన్నది చూడాలి.

అయితే ఈ చిత్రాన్ని మాత్రం ఆడియెన్స్ కోరిక మేరకు పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కానీ తెలుగు వర్షన్‌ను మాత్రం డిసెంబర్‌ 2నే విడుదల చేస్తామని, ఆ తరువాత  హిందీ వర్షన్ గురించి ఆలోచిస్తామని అన్నారు. ఎందుకంటే ఈ చిత్రాన్ని ముందుగా తెలుగు వరకే ప్లాన్ చేశామని అడివి శేష్ అన్నాడు. కానీ పాన్ ఇండియాగా చేద్దామని నానితో అంటే..వెంటనే ఓకే చెప్పేశాడంటూ ఆడివి శేష్ తెలిపాడు.

Also Read : Hero Karthikeya With cheetah : చిన్నప్పటి 'చిరు' కల నెరవేరిందట.. చిరుతపులితో హీరో కార్తికేయ

Also Read : Boss Party Song : బాస్ పార్టీ.. గ్రేసుతో కుమ్మేశాడుగా.. నిరాశ పర్చిన దేవి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News