Adipurush Movie Controversy on Dialogues: పాన్ ఇండియా మూవీ ప్రభాష్ శ్రీరాముడి పాత్రలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలై రెండ్రోజులైంది. భారీ అంచనాల కారణంగా మూడ్రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి. అదే సమయంలో సినిమా చుట్టూ ఫ్లాప్‌టాక్, కొత్త వివాదం తిరుగుతోంది.
ఆదిపురుష్ సినిమా డిజాస్టర్ అయిందా బ్లాక్ బస్టర్ అయిందా అనేది కాస్సేపు పక్కనబెడదాం. దీనిపై ఇప్పుడే నిర్ధారణకు రావడం కష్టం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి. దాంతో కలెక్షన్లపై ఫ్లాప్ టాక్ అప్పుడే ప్రభావం చూపించకపోవచ్చు. మొదటి మూడ్రోజులు అయిన తరువాత అంటే నాలుగవరోజు నుంచి సినిమా పరిస్థితి ఏంటనేది అర్ధమౌతుంది. ఈలోగా సినిమా చుట్టూ కొత్త వివాదం రేగుతోంది. సినిమాలోని డైలాగ్స్‌పై ప్రేక్షకులు, ముఖ్యంగా ఓ వర్గం ప్రజలు మండిపడుతున్నారు.
హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయనే వాదన పెరుగుతోంది. హనుమంతుడి నోట పలికించి కొన్ని డైలాగ్స్ అసభ్యకరరీతిలో ఉన్నాయంటున్నారు. డైలాగ్స్ తొలగించాలనే విమర్శలు పెరుగుతున్నాయి. మరోవైపు ఆదిపురుష్ సినిమాకు వ్యతిరేకంగా కొందరు ఢిల్లీ హైకోర్టులో పిల్ కూడా దాఖాలు చేశారు. హిందూవుల విశ్వాసాలు, మనోభావాల్ని దెబ్బతీసేలా సినిమా తీశారని, ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్ని తొలగించాలని పిటీషనర్ కోరారు.
Also Read: Rashmika Mandanna: మేనేజర్ చేతిలో దారుణంగా మోసపోయిన రష్మిక.. గుడ్డిగా నమ్మితే చివరికి..!
ఆదిపురుష్ డైలాగ్స్‌పై వివాదం పెరుగుతుండటంతో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో వచ్చే వారం నుంచి కొత్త డైలాగ్స్‌తో సినిమా ఉంటుందని వెల్లడైంది. ఈ విషయాన్ని స్వయంగా సినిమాకు డైలాగ్స్ రాసిన రచయిత మనోజ్ ముంతషిర్ శుక్లా తెలిపారు. తాను రాసిన డైలాగ్స్‌కు అనుకూలంగా లెక్కలేనన్ని వాదనలు ఇవ్వగలిగినా మీ బాధను తగ్గించలేనని మనోజ్ వివరించారు. అందుకే కొన్ని డైలాగ్స్‌ని రివైజ్ చేసి కొత్తవి చేరుస్తామని వచ్చే వారం కొత్త డైలాగ్స్‌తో ఆదిపురుష్ మీ ముందుంటుందని ఆయన తెలిపారు.
అయితే ఆదిపురుష్ సినిమా డైలాగ్స్ నచ్చని కొంతమంది చేసిన ట్రోలింగ్‌పై రచయిత మనోజ్ శుక్లా నొచ్చుకున్నారు. ఈ సినిమాలో తాను 4000 లైన్లతో శ్రీరాముడిని, సీతను కీర్తించిన విషయాన్ని పక్కనబెట్టి కేవలం 5 లైన్లు మనోభావాలు దెబ్బతీశాయని విమర్శించడంపై ఆయన ఆవేదన చెందారు. ఈ 5 లైన్లను ఆధారం చేసుకుని సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన మాటలు రాశారని, ఏకంగా సనాతన్ ద్రోహిగా మార్చేశారన్నారు. సినిమాలో తన కలం నుంచి వచ్చిన జై శ్రీరామ్, శివోహం, రామ్ సియారామ్ పాటలు కన్పించలేదా అని ప్రశ్నించారు.
Also Read: Adipurush Controversy: ఆదిపురుష్‌పై వివాదం.. దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని డిమాండ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి