Riya Kumari shot dead: సినీ నటిని కాల్చి చంపిన దుండగులు.. భర్తపైనే అనుమానం

Actress Riya Kumari Shot Dead in Howrah: రియా కుమారి మర్డర్ జరిగన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రకాశ్ కుమార్ చెప్పిన ఇచ్చిన ఈ వాంగ్మూలమే పోలీసులకు ఎన్నో అనుమానాలకు, ఇంకెన్నో సందేహాలకు తావిచ్చింది. మొదటి సందేహం ఏంటంటే.. అంత నిర్మానుష్యమైన ప్రాంతంలో ప్రకాశ్ కుమార్ కారు ఆపుతాడని దుండుగులకు ఎలా తెలిసింది ?

Written by - Pavan | Last Updated : Dec 28, 2022, 11:09 PM IST
Riya Kumari shot dead: సినీ నటిని కాల్చి చంపిన దుండగులు.. భర్తపైనే అనుమానం

Actress Riya Kumari Shot Dead in Howrah: జార్ఖండ్‌కి చెందిన సినీ నటి రియా కుమారిని గుర్తుతెలియని దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారు. పశ్చిమ బెంగాల్లోని హౌరాలో నేషనల్ హైవేపై బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ఘటనపై రియా కుమారి భర్త ప్రకాశ్ కుమార్ చెబుతున్న పొంతన లేని సమాధానాలు చూస్తోంటే.. రియా కుమారి హత్య అనుమానాస్పదంగా ఉందని హౌరా పోలీసులు చెబుతున్నారు. రియా కుమారిని కాల్చి చంపిన సమయంలో ప్రకాశ్ కుమార్ వారి కారు నడుపుతున్నారు. మూడేళ్ల కూతురు కూడా కారులోనే ఉంది. 

బుధవారం ఉదయం 6 గంటలకు రాంచి నుంచి కోల్‌కతా వెళ్లే సమయంలో జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగిందని ప్రకాశ్ కుమార్ పోలీసులకు తెలిపాడు. హౌరా జిల్లా ఉలుబెరియా సబ్-డివిజన్ పరిధిలోని బగ్నన్‌లోని మహిశ్రేఖ బ్రిడ్జి వద్ద నాచురల్ కాల్ కోసం తాను వాహనం ఆపానని.. అదే సమయంలో ముగ్గురు దుండగులు తమపై దాడికి పాల్పడి దోచుకునేందుకు యత్నించారని.. వారితో తిరగబడే క్రమంలో వారిలో ఒకడు రియాను పాయింట్ బ్లాంక్ రేంజులో షూట్ చేశాడని ప్రకాశ్ కుమార్ చెప్పుకొచ్చాడు.

ప్రకాశ్ కుమార్ చెప్పిన ఇచ్చిన ఈ వాంగ్మూలమే పోలీసులకు ఎన్నో అనుమానాలకు, ఇంకెన్నో సందేహాలకు తావిచ్చింది. మొదటి సందేహం ఏంటంటే.. అంత నిర్మానుష్యమైన ప్రాంతంలో ప్రకాశ్ కుమార్ కారు ఆపుతాడని దుండుగులకు ఎలా తెలిసింది ? రెండో ప్రశ్న ఏంటంటే.. ప్రకాశ్ కుమార్ వాహనాన్ని ముగ్గురు దుండగులు వెంబడించారా అంటే అందుకు అతడి వద్ద సమాధానం లేదు. మూడో ప్రశ్న ఏంటంటే.. ఒకవేళ ప్రకాశ్ కుమార్ కారు ఆపాలని అనుకున్నా.. అలాంటి నిర్మానుష్యమైన చోట కారు ఆపేంత సాహసం ఎవ్వరూ చేయరు. అంత స్కోప్ కూడా అక్కడ లేదు. 

ప్రకాశ్ కుమార్ చెప్పేదాన్ని బట్టి చూస్తోంటే.. అతడు చెప్పేది నిజమే అయ్యుండొచ్చు. దుండగులు ఉన్న చోటే యాదృచ్ఛికంగా అతడు వాహనం ఆపినప్పుడు ఈ దాడి జరిగే అవకాశం ఉంది. ఇదంతా కాదంటే.. ఇది మొత్తం నాటకమే అయ్యే అవకాశం ఉంది. ఘటన జరిగిన స్థలం పరిసరాల్లో ఏమైనా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇది కూడా చదవండి : Jabardasth Punch Prasad : ఏడిపించిన పంచ్ ప్రసాద్.. ఫ్యామిలీ ఫోటోతో ఎమోషనల్.. మరీ ఇంత విషాదమా?

ఇది కూడా చదవండి : Nandamuri Balakrishna-Ram Charan : సంక్రాంతికి ముందు నా సినిమా చూడు.. రామ్ చరణ్‌ను బెదిరించిన బాలయ్య

ఇది కూడా చదవండి : Sujatha Rakesh : దుబాయ్‌లో ప్రేమ జంట.. సుజాత రాకేష్ పిక్స్.. జోర్దార్‌గా ఉందే వ్యవహారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News