Sushant Singh Rajput Death case: రియా చక్రవర్తి అరెస్ట్

బాలీవుడ్ యువనటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput Death case) మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుకు సంబంధించి డ్రగ్స్ కుట్ర వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చక్రవర్తి (Rhea Chakraborty) ని అరెస్టు చేసింది.

Last Updated : Sep 8, 2020, 04:36 PM IST
Sushant Singh Rajput Death case: రియా చక్రవర్తి అరెస్ట్

Actress Rhea Chakraborty arrested by NCB: న్యూఢిల్లీ‌: బాలీవుడ్ యువనటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput Death case) మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుకు సంబంధించి డ్రగ్స్ కుట్ర వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో..  రియా చక్రవర్తి (Rhea Chakraborty) ని అరెస్టు చేసింది. ఎన్‌డీపీఎస్‌లోని వివిధ సెక్ష‌న్ల కింద ముంబైలో మంగళవారం రియా చ‌క్ర‌వ‌ర్తిని అరెస్టు చేసిన‌ట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో  (NCB) డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా వెల్లడించారు. అయితే డ్ర‌గ్స్ వ్యవహారంలో పలు వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఇప్ప‌టికే నార్కోటిక్స్ పోలీసులు ప‌లువుర్ని అరెస్టు చేశారు. రియా సోద‌రుడు శౌవిక్‌తో పాటు సుశాంత్ ఇంటి మేనేజ‌ర్ సామ్యూల్‌ను కూడా ఇప్పికే ఎన్‌సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. డ్ర‌గ్స్ కేసులో గ‌త మూడు రోజుల నుంచి రియాను ఎన్‌సీబీ విచారించి.. తాజాగా అరెస్టు చేసింది. Also read: Exclusive Photos: నటి రియా చక్రవర్తి చిన్ననాటి అరుదైన ఫోటోలు

అయితే రియా చక్రవర్తికి డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నట్లు తేలిందని, అందుకే ఆమెను అరెస్టు చేసినట్లు బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే వెల్లడించారు. ఈ మేరకు ఎన్‌సీబీ కీలక ఆధారాలను సేకరించిందని ఆయన వెల్లడించారు. అయితే.. జూన్ 14వ తేదీన సుశాంత్ త‌న ఇంట్లో అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందిన విష‌యం తెలిసిందే. అప్పటినుంచి ఈ కేసు రోజుకో మలుపు తిరగడంతోపాటు.. బాలీవుడ్‌లో, జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది. Also read: Sushant singh Case: ముంబై పోలీసులు ఏం దాచిపెడుతున్నారు?

Trending News