Pranitha Subhash: కాళ్ల దగ్గర కూర్చుని పూజ చేస్తే తప్పేంటి.. నెటిజన్ల కామెంట్లకు ప్రణీత సుభాష్ ఘాటు కౌంటర్!

Pranitha Subhash Gave Clarity on Sitting At Her Husband's Feet: భర్త కాళ్ళ దగ్గర కూర్చుని భీమనామావాస్య  వ్రతం మీద అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో హీరోయిన్ ప్రణీత సుభాష్ స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 4, 2022, 11:40 AM IST
  • ప్రణీత భార్తకు పాదపూజ
  • ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్ల విమర్శలు
  • ఘాటు కౌంటర్ ఇచ్చిన ప్రణీత
Pranitha Subhash: కాళ్ల దగ్గర కూర్చుని పూజ చేస్తే తప్పేంటి.. నెటిజన్ల కామెంట్లకు ప్రణీత సుభాష్ ఘాటు కౌంటర్!

Actress Pranitha Subhash Gave Clarity on Sitting At Her Husband's Feet: హీరోయిన్ ప్రణీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో అనేక సినిమాలలో నటించిన ఆమె కన్నడలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈమధ్య అవకాశాలు తగ్గడంతో వివాహం చేసుకొని ఇటీవలే ఒక పండంటి మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం అమ్మ తనాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్న ప్రణీత హిందూ మతానికి చెందిన వ్యక్తి కావడంతో అడపాదడపా హిందూ మతాన్ని సపోర్ట్ చేస్తూ ఆమె కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు.

ఇటీవల కొద్ది రోజుల క్రితం ఆమె తన భర్త నితిన్ రాజుకు పాదపూజ చేస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిని భీమనామావస్య పూజ అంటారు. సాధారణంగా పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త రావాలని ఈ పూజ చేస్తారు. పెళ్లయిన ఆడవాళ్లు తమ భర్త ఆయురారోగ్యాలతో సౌఖ్యంగా ఉండి తమ కుటుంబం బాగుండాలని భర్తల పాద పూజ చేస్తారు. అయితే ఆమె ఈ ఫోటోలు షేర్ చేయడంతో కొందరు నెటిజెన్లు రకరకాల కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం మీద చాలా రోజుల నుంచి సైలెంట్ గా ఉన్న ప్రణీత తాజాగా స్పందించారు.

జీవితంలో జరిగే జరిగే ప్రతి విషయానికి రెండు కోణాలు ఉంటాయని ఆమె అన్నారు. అందులో 90 శాతం మంది పాజిటివ్గా స్పందిస్తే మిగిలిన వారు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారని అన్నారు. అదంతా నేను పట్టించుకోనన్నా ఆమె ఒక నటిగా గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నంత మాత్రాన సంప్రదాయాలు ఆచారాలు ఎందుకు పాటించకూడదు అనుకుంటున్నారని ప్రశ్నించారు. చిన్నప్పటినుంచి నేను అవన్నీ చూస్తూ పెరిగాను, మా అక్క చెల్లెలు, స్నేహితురాళ్ళు, పక్కింటి వాళ్ళు కూడా పూజలు చేశారు.

పెళ్లయిన కొత్తలో గత ఏడాది కూడా పూజ చేశాను కాకపోతే అప్పుడు ఫోటో షేర్ చేయలేదు చెప్పాలంటే ఇది నాకు కొత్తమీ కాదు ఎప్పుడూ నేను ఒక పద్ధతిగల అమ్మాయిలాగానే నడుచుకోవాలి అనుకుంటానని ఆమె అన్నారు. మన సంప్రదాయాలు, సంప్రదాయ విలువలు, పూజలు పునస్కారాలు వంటి ఆచారాలను నేను గౌరవిస్తానని ఆమె అన్నారు. మాది ఒక ఉమ్మడి కుటుంబం మా అమ్మలు, పెద్దమ్మలు, నాన్నమ్మలు, అంకుల్స్ మధ్యే నేను పెరిగాను ఆ వాతావరణం అంటే నాకు ఇష్టం. మోడరన్ గా ఆలోచించడం అంటే మనం నడిచి వచ్చిన దారిని మరిచిపోవడం కాదు అంటూ ఆమె కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.

Also Read: Har Ghar Tiranga Song: ప్రభాస్, కీర్తి సురేష్, దేవిశ్రీల ‘హర్ ఘర్ తిరంగా’ సాంగ్.. చూశారా!

Also Read: Prabhas: ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా?.. పరిశ్రమపై ప్రభాస్ కామెంట్స్ వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News