Bigg Boss 4: పూనమ్‌ కౌర్‌ను బిగ్‌బాస్ రిజెక్ట్ చేశారని ప్రచారం.. నిజమేంటి?

బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్ కంటెస్టెంట్స్ (Bigg Boss 4 Contestants) వీరేనంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ మేనేజ్‌మెంట్ నటి పూనమ్ కౌర్‌ను కంటెస్టెంట్‌గా రిజెక్ట్ చేశారని (Poonam Kaur Rejected Bigg Boss Offer) ప్రచారం జరుగుతోంది.

Last Updated : Aug 16, 2020, 03:50 PM IST
  • బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న షో బిగ్ బాస్ 4
  • నాలుగో సీజన్ కోసం హోస్ట్ నాగార్జున ఎప్పుడో రెడీ అయ్యారు
  • కంటెస్టెంట్ల వివరాల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు
Bigg Boss 4: పూనమ్‌ కౌర్‌ను బిగ్‌బాస్ రిజెక్ట్ చేశారని ప్రచారం.. నిజమేంటి?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్‌బాస్’ (Bigg Boss 4) లేటెస్ట్ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. కరోనా వ్యాప్తి వల్ల ఈ ఏడాది బిగ్‌బాస్ కాస్త ఆలస్యమైంది. నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్లు వీరేనంటూ ఇప్పటికే ఎన్నో లిస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సుధీర్, రష్మీని బిగ్‌బాస్ ఇంట్లోకి పంపి ఎంటర్‌టైన్ చేస్తారని ఓసారి ప్రచారం జరగగా.. జబర్దస్త్ యాంకర్ అనసూయ, హీరో తరుణ్, హైపర్ ఆదిలను బిగ్‌బాస్‌ హౌస్‌లో చూడబోతున్నారని చర్చ జరిగింది. Bigg Boss 4 కంటెస్టెంట్స్ వీళ్లేనా.. స్టార్ మా ఫిక్స్ అయ్యిందా!

తాజాగా స్టార్ మా బిగ్ బాస్ 4 ప్రోమోను విడుదల చేసి అంచనాలు పెంచుతోంది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) మరోసారి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ క్రమంలో నటి పూనమ్ కౌర్‌ (Poonam Kaur)ను బిగ్‌బాస్ మేనేజ్‌మెట్ రిజెక్ట్ చేసిందని ప్రచారం జరిగింది. ఆ కథనాలపై పూనమ్ కౌర్ స్పందించింది. తానే బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్లు (Poonam Kaur Rejected Bigg Boss) చెబుతోంది. కొన్ని పోస్టులకు బదులిస్తూ ఆఫర్ రిజెక్ట్ చేసింది నేనే అని కామెంట్లలో బదులిచ్చింది. Bigg Boss Telugu: సీజన్-4 ప్రోమో విడుదల

అసలే తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అవకాశాలు ఉండటంతో... బిగ్‌బాస్ హౌస్‌లో ఉండటం అంత తేలికేమీ కాదని పూనం కౌర్ భావించింది. ప్రతి విషయాన్ని, మాటను భూతద్దంలో పెట్టి చూసి గొడవలు జరుగుతాయి తప్ప తనకేమీ లాభం లేదని భావించిన ఈ అమ్మడు తెలివిగా బిగ్ బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. అందాలతో బుసలు కొడుతున్న ‘నాగిని’ Nia Sharma Hot Photos
Photos:
 అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా.. 

Trending News