Actress Nabha Natesh: చార్లీ చాప్లిన్ లుక్‌లో 'మ్యాస్ట్రో' భామ..ఫోటోస్ వైరల్

హీరోయిన్ రకరకాల ఫోజులతో ఫోటో షూట్స్ చేసి..ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. వాటికి అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పెడుతుంటారు. తాజాగా ఓ భామ చార్లీ చాప్లిన్ లుక్ లో దర్శనమిచ్చింది. ఇంతకీ ఆ భామ ఎవరంటే..

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 30, 2021, 07:40 PM IST
Actress Nabha Natesh: చార్లీ చాప్లిన్ లుక్‌లో 'మ్యాస్ట్రో' భామ..ఫోటోస్ వైరల్

Actress Nabha Natesh: హీరోయిన్స్ ఎప్పటికప్పుడు న్యూ లుక్స్ తో అభిమానులను ఆకట్టుకుంటారు. ఈ ముద్దుగమ్మలు వయ్యారాలు ఒలకబోస్తూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. చాలా మంది నటీమణులు హాట్ లుక్స్ లోనూ, సాంప్రదాయ దుస్తుల్లోనూ మెరుస్తూంటారు. కానీ  ఓ భామ మాత్రం అందరికీ భిన్నంగా ఆలోచించి..చార్లీ చాప్లిన్ లుక్ లో అలరించింది.

ఆమె ఎవరంటే...
టాలీవుడ్‌లో ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్లలో నభా నటేష్ (Actress Nabha Natesh )ఒకరు. నన్ను దోచుకుందువటే, ఇస్మార్ట్ శంకర్,‘‘సోలో బ్రతుకే సో బెటర్’’ సినిమాల్లో గ్లామరస్ రోల్స్‌లో ఆకట్టుకున్న నభా తాజాగా మాస్ట్రో సినిమాలోనూ తన అందంతో ఫ్యాన్స్‌ను అలరించింది. ఇక నభా సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోవర్స్ కి కనువిందు చేస్తుంది. ఎప్పుడూ గ్లామర్ షూట్స్ చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇందుకు భిన్నమైన ఫోటో షూట్ చేసింది.

Also Read: Idhe Maa Katha trailer: ఇదే మా కథ ట్రైలర్‌ రిలీజ్.. ట్రావెలర్స్‌గా అదగొట్టిన శ్రీకాంత్‌, సుమంత్‌ అశ్విన్‌, భూమిక

అందులో నభా నటేష్ చార్లీ చాప్లిన్(Charlie Chaplin) అవతారమెత్తింది. ఫన్నీగా ఉన్న నభా చార్లీ చాప్లిన్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. భిన్నమైన ఈ గెటప్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక నభా సినిమాల విషయాని కొస్తే ఇటీవలే నితిన్ నటించిన మాస్ట్రో(Maestro) సినిమాలో హీరోయిన్‌గా చేసింది. అలాగే మహేష్ బాబు త్రివిక్రమ్ కాబినేషన్‌లో రానున్న సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News