'ఒక్క రూపాయి సంపాదించలేదు.. ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు'.. నరేష్‌పై హేమ సంచలన వ్యాఖ్యలు

'మా' అధ్యక్షుడు నరేశ్‌పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరపకుండా, తిరిగి ఆయనే అధ్యక్షుడిగా కొనసాగాలే పావులు కదుపుతున్నారని ఆమె ఆరోపించారు.     

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 7, 2021, 05:14 PM IST
    • 'మా' లో మళ్లీ ఎన్నికల రగడ
    • నరేష్‌పై హేమ కామెంట్స్
    • ఎన్నికల జరపాలంటూ హేమ సంతకాల సేకరణ
'ఒక్క రూపాయి సంపాదించలేదు.. ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు'.. నరేష్‌పై హేమ సంచలన వ్యాఖ్యలు

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా)లో మళ్లీ ఎన్నికల రగడ మొదలైంది. ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్‌(Naresh)పై నటి హేమ(hema) సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలు జరపకుండా..తానే  అధ్యక్షుడిగా కొనసాగాలే నరేశ్ చూస్తున్నారని ఆమె ఆరోపించారు.

ప్రస్తుత ప్యానల్‌ ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా.. ఉన్నదంతా ఊడ్చేస్తోందని ఆమె మండిపడ్డారు. తాము ఫండ్‌ రైజ్‌ చేసి ఇస్తే.. నరేశ్‌(Naresh) ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. 

Also Read: MAA Elections 2021: మా ఎన్నికల్లో నరేష్ కొత్త ప్రతిపాదన వర్కవుట్ అయ్యేనా

'మా'(MAA) ఎన్నికలు జరపాలంటూ హేమ సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ సారి ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్‌(Prakash Raj‌), మంచు విష్ణు(Manchu Vishnu), జీవితా రాజశేఖర్‌(Jeevita Rajasekhar), హేమలతో పాటు సీవీఎల్‌ నరసింహారావు(CVL Narasimha Rao) కూడా ఉన్నారు. తన సపోర్టర్స్ కోరిక మేరకే ఈ సారి అధ్యక్ష పదవి కోసం పోటీకి దిగుతున్నట్లు హేమ పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News