ఒక్కో ఎపిసోడ్‌కి 2 లక్షలు కావాలంటున్న హీరోయిన్

మలయాళం బ్యూటి అను ఇమ్మాన్యుయేల్‌ను OTT లో వెబ్ సిరీస్ కోసం సంప్రదించగా, ఆమె చేసిన డిమాండ్‌కి మేకర్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ స్క్రిప్ట్‌కి అను ఇమ్మాన్యుయేల్ ఐతే బాగా సూట్ అవుతుందని భావించిన మేకర్స్ ఆమెతో చర్చలు జరిపారు.

Last Updated : Aug 28, 2020, 02:03 AM IST
ఒక్కో ఎపిసోడ్‌కి 2 లక్షలు కావాలంటున్న హీరోయిన్

మలయాళం బ్యూటి అను ఇమ్మాన్యుయేల్‌ను OTT లో వెబ్ సిరీస్ కోసం సంప్రదించగా, ఆమె చేసిన డిమాండ్‌కి మేకర్స్‌కు భారీ షాక్ తగిలింది. నటి అను ఇమ్మాన్యుయేల్ ( Actress Anu Emmanuel ) వెబ్ సిరీస్‌లో నటించడం కోసం ఒక ఎపిసోడ్‌కి రూ. 2 లక్షల రెమ్యునరేషన్ ( Anu Emmanuel's remuneration ) కోట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్‌‌తో ఒక కొత్త డైరెక్టర్ పరిచయం కానున్నాడు. అలాగే ఆ స్క్రిప్ట్‌కి అను ఇమ్మాన్యుయేల్ ఐతే బాగా సూట్ అవుతుందని భావించిన మేకర్స్ ఆమెతో చర్చలు జరిపారు. కానీ అమె కోరిన పారితోషికంపై మేకర్స్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. Also read : ఓటిటిలో విడుదల కానున్న Anchor Sreemukhi సినిమా

టాలీవుడ్‌లో, అను ఇమ్మాన్యుయేల్ చివరిసారిగా నాగచైతన్యతో కలిసి నటించిన రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు ( Shailaja Reddy Alludu ) 2018 లో విడుదలైంది. అను ఇమ్మాన్యుయేల్ మజ్ను సినిమాతో టాలివుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య, గీత గోవిందం వంటి చిత్రాలలో నటించింది. కానీ ఇప్పటివరకు పెద్ద సక్సెస్‌ని మాత్రం అందుకోలేదు ఈ బ్యూటీ. Also read : Ananya Panday: ఈ హీరోయిన్‌తో పూరి జగన్నాథ్‌కి కొత్త కష్టాలు

ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కలిసి అల్లుడు అదుర్స్ ( Alludu adurs ) అనే చిత్రంలో నటిస్తోంది. ఇక తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకుందని ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. Also read : Acharya controversy: ఆచార్య కథ కాపీనా ? స్పందించిన నిర్మాతలు

Trending News