Actor Vishal: మరోసారి హీరో విశాల్ కు ప్రమాదం.. షూటింగ్లో తీవ్ర గాయాలు!

Actor Vishal Injured in Shooting: ఒకే రోజు ముగ్గురు సినీ ప్రముఖులకు గాయాలయ్యాయి. షూటింగ్ లో హీరో విశాల్, హీరోయిన్ శిల్పా శెట్టి, టబు ఒకేరోజు గాయపడ్డారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 11, 2022, 02:08 PM IST
  • మరోసారి హీరో విశాల్ కు ప్రమాదం..
  • షూటింగ్లో తీవ్ర గాయాలు
  • అర్ధాంతరంగా నిలిచిన షూటింగ్
Actor Vishal: మరోసారి హీరో విశాల్ కు ప్రమాదం.. షూటింగ్లో తీవ్ర గాయాలు!

Actor Vishal Injured in Shooting: సినీ పరిశ్రమలో వరుస ప్రమాదాలు టెన్షన్ పెడుతున్నాయి. ఒకే రోజు ముగ్గురు సినీ ప్రముఖులు ప్రమాదాల బారిన పడటం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లో జరుగుతున్న బాలీవుడ్ మూవీ ‘భోలా’ షూటింగ్లో నటి టబూ గాయపడ్డారు. ఒక గాజు ముక్క ఆమె నుదుటి భాగంలో గుచ్చుకోవడంతో ఆమెకు వెంటనే ప్రథమ చికిత్స చేయించి షూటింగ్ అప్పటికప్పుడు నిలిపివేసింది సినిమా యూనిట్. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ లో ఆమెకు ఈ గాయాలయ్యాయి.

మరోపక్క ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే ఒక వెబ్ సిరీస్ షూటింగ్లో భాగంగా శిల్పా శెట్టికి గాయాలయ్యాయి. ఆమె కాలు విరగడంతో ఆమెకు ఆరు వారాలపాటు బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్లు సూచించారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది. మరోపక్క తమిళ హీరో విశాల్ కు కూడా గాయాలైనట్లు సమాచారం. గురువారం తెల్లవారుజామున ఆయనకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పలుసార్లు విశాల్ షూటింగ్లో గాయాలు ఫపాలవగా తాజాగా ఆయన నటిస్తున్న మార్క్ ఆంటోని సినిమా షూటింగ్ లో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సినిమాలో ఒక కీలకమైన ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్న సమయంలో ఆయన ప్రమాదానికి గురైనట్లు సమాచారం. విశాల్ గాయపడటంతో ఆయనకు వెంటనే సెట్ లో ఉన్న డాక్టర్ ప్రథమ చికిత్స అందించి రెస్ట్ తీసుకోమని సూచించారు. దీంతో ప్రస్తుతానికి మార్క్ ఆంటోనీ సినిమా షూటింగ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది.

ఇక సోషల్ మీడియా వేదికగా విశాల్ గాయపడిన వార్తలు బయటకు రావడంతో విశాల్ అభిమానులు ఆయనకు ఏమైందో అనే టెన్షన్ లో ఉన్నారు. అయితే సినీ యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆయనకు తీవ్రంగానే గాయాలు అయ్యాయి. కానీ పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని,  ఆయన త్వరలోనే కోలుకొని మళ్ళీ షూటింగ్లో పాల్గొంటారని చెబుతున్నారు.

Also Read: Shilpa Shetty: షూటింగ్లో ప్రమాదం.. కాలు విరగ్గొట్టుకున్న శిల్పా శెట్టి!

Also Read: Actress Tabu: షూటింగ్లో ప్రమాదం..తీవ్రంగా గాయపడిన టబు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News