డిస్కోరాజా ట్విట్టర్ రివ్యూ: మాస్ మహారాజా ఈజ్ బ్యాక్

రవితేజ హీరోగా వీఐ ఆనంద్ తెరకెక్కించిన సినిమా డిస్కోరాజా శుక్రవారం విడుదలైంది. రవితేజ ఈజ్ బ్యాక్ అంటూ ఆడియెన్స్ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.

Last Updated : Jan 25, 2020, 12:18 PM IST
డిస్కోరాజా ట్విట్టర్ రివ్యూ: మాస్ మహారాజా ఈజ్ బ్యాక్

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా డిస్కోరాజా. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (జనవరి 24న) థియేటర్లలో విడుదలైంది. రవితేజకు జోడీగా ‘ఇస్మార్ట్ శంకర్’ ఫేమ్ నభా నటేష్, ‘RX100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్ నటించారు. బాబి సింహ ప్రతినాయకుడు. వరుస మ్యూజికల్ హిట్లు కొడుతున్న ఎస్.థమన్ సంగీతం అందించాడు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి డిస్కోరాజా సినిమా నిర్మించగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు.

డిస్కో రాజా రొటీన్ కమర్షియల్ సినిమాల్లా కాదు. ఇది ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ. కొత్త రవితేజను చూస్తారు. రవితేజ గతంలో చేసిన వాటి కంటే భిన్నంగా ఉంటుంది. రవితేజ క్యారెక్టర్ సూపర్ అని టాక్ వినిపిస్తోంది. 

ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది.

సెకండాఫ్ మాత్రం జస్ట్ ఓకే. క్లైమాక్స్‌ను ఆడియన్స్ అంతగా ఇష్టపడకపోవచ్చు. ఓవరాల్‌గా 3.25 రేటింగ్ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. రవితేజ నటనకు మరో 0.25 రేటింగ్ ఇస్తున్నానని మాస్ మహరాజ్‌పై అభిమానాన్ని చాటుకున్నాడు.

రవితేజ హీరోగా వీఐ ఆనంద్ తెరకెక్కించిన సినిమా డిస్కోరాజా శుక్రవారం విడుదలైంది. రవితేజ ఈజ్ బ్యాక్ అంటూ ఆడియెన్స్ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.

 

బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. రవితేజ ఎనర్జీ మళ్లీ చూపించాడు. నభా నటేష్ అందం, పాయల్ రాజ్ పుత్, రవితేజ జంట సూపర్‌గా ఉంది. వెన్నెలకిశోర్ కడుపుబ్బా నవ్వించేశాడని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.

 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News