Disco Raja collections: డిస్కోరాజా కలెక్షన్స్: తొలిరోజు ‘మాస్ మహారాజా’ సక్సెస్!

సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురం సినిమాల కారణంగా రవితేజ డిస్కోరాజాకు పెద్ద సంఖ్యలో థియేటర్లు దొరలేదు. అయినా మాస్ మహారాజా తన స్థాయికి తగ్గ కలెక్షన్లు వసూలుచేశాడు.

Last Updated : Jan 25, 2020, 12:15 PM IST
Disco Raja collections: డిస్కోరాజా కలెక్షన్స్: తొలిరోజు ‘మాస్ మహారాజా’ సక్సెస్!

మాస్ మహారాజా, ఎనర్జిటిక్ హీరో రవితేజతో వీఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా డిస్కోరాజా. శుక్రవారం (జనవరి 24న) థియేటర్లలో విడుదలైన సినిమాకు విమర్శకుల దగ్గర మంచి మార్కులే పడ్డాయి. డిస్కోరాజాలో రవితేజకు జోడీగా ఫేమ్ నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్ నటించారు. అయితే బన్నీ, మహేశ్‌లు వారి రేంజ్‌లో సక్సెస్ సాధించినట్లే రవితేజకు డిస్కోరాజా బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు రాబడుతోంది. డిస్కోరాజా తొలిరోజు వరల్డ్ వైడ్ రూ.5 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం.

ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయిందని టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి బరిలో నిలిచిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో సినిమాలే ఇంకా చాలా థియేటర్లలో ఆడుతుండటంతో రవితేజ ‘డిస్కోరాజా’కు తక్కువ థియేటర్లు దొరికాయి. నైజాంలో తొలిరోజు 1.05కోట్ల రూపాయలు వసూలు చేసింది. థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.19.20 కోట్లు రాగా, ఓవరాల్‌గా రూ.22కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ చేసి మాస్ మహారాజా సత్తా చాటింది.

నైజాంలో అత్యధికంగా రూ.5.7కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఉత్తరాంధ్రలో రూ.1.95కోట్లు, సీడెడ్ ఏరియాలో రూ.2.7కోట్లు, తూర్పు గోదావరిలో రూ.1.25కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.1.05కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.1.25 కోట్లు, గుంటూరులో రూ.1.5కోట్లు, నెల్లూరులో రూ.65లక్షలు.. ఇతర రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కలుపుకుని మొత్తం రూ.3 కోట్లకు పైగా ప్రి రీలీజ్ చేసింది డిస్కోరాజా. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News