Ramya Raghupathi Shocking Comments: నరేష్ -పవిత్రల పెళ్లి, లిప్ లాక్ పై రమ్య రఘుపతి షాకింగ్ కామెంట్స్!

Ramya Raghupathi Shocking Comments: నరేష్-పవిత్ర లోకేష్ లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రమంలో ఈ వీడియో మీద రమ్య రఘుపతి స్పందించారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 5, 2023, 07:41 PM IST
Ramya Raghupathi Shocking Comments: నరేష్ -పవిత్రల పెళ్లి, లిప్ లాక్ పై రమ్య రఘుపతి షాకింగ్ కామెంట్స్!

Actor Naresh Wife Ramya Raghupathi Shocking Comments on Naresh Pavitra: టాలీవుడ్ సీనియర్ హీరో, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సత్తా చాటుతున్న నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకోబోతున్నట్లు డిసెంబర్ 31వ తేదీన అధికారికంగా ప్రకటించారు. ఇక వారిద్దరూ లిప్ కిస్ చేసుకుంటున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 2023 కి కొత్తగా స్వాగతం పలుకుతున్నామంటూ పేర్కొనడం సంచలనంగా మారింది. అయితే ఇప్పటివరకు వివాహం మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వని ఈ జంట ఏకంగా వివాహం చేసుకోబోతున్నాము అంటూ ప్రకటించడంతో అనేక చర్చలు జరిగాయి.

నరేష్ తన మూడవ భార్య రమ్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని అన్ని విషయాలు క్లియర్ అయిపోవడంతో నరేష్ పవిత్ర వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మొట్టమొదటిసారిగా తెలుగు మీడియా ముందుకు వచ్చారు. నరేష్ పవిత్ర లిప్ లాక్ వీడియో మీద మీరు చాలా కంగారు పడుతున్నారని తెలిసిందని యాంకర్ పేర్కొనగా ఇది మీకు కొత్త ఏమో కానీ నాకు కొత్త కాదని రమ్య రఘుపతి పేర్కొన్నారు. తాను నరేష్ మీద ఆరోపణలు చేశానని దానికి తగిన సాక్ష్యాలు కూడా తాను కన్నడ మీడియా ముందు పెట్టానని ఆమె పేర్కొన్నారు.

ఇలాంటివన్నీ చూస్తూ ఏ భార్య అయితే తట్టుకోగలదని ఆమె ప్రశ్నించారు. అయితే ఇద్దరూ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు కావడంతో ఏమైనా సినిమా ప్రమోషన్స్ ఏమో అనే అనుమానాలు కూడా తనకు ఉన్నాయని ఆమె అంటుంటే ఇప్పుడు నరేష్ పవిత్ర విషయం మీద కూడా అదే ప్రచారం జరుగుతోందని వీరిద్దరూ మళ్లీ పెళ్లి అనే సినిమాలో నటిస్తున్నారని దానికి సంబంధించిన ప్రమోషన్స్ విషయంలోనే ఇలా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయని యాంకర్ పేర్కొన్నారు. అయితే ఇదే విషయం మీద ఆమె మాట్లాడుతూ వాళ్ళు గనుక నిజంగా సినిమా తీస్తే మళ్లీ పెళ్లి అని కాదు మళ్ళీ మళ్ళీ మళ్ళీ పెళ్లి అని టైటిల్ పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.

అయితే రమ్య రఘుపతి నవ్వుతూ మాట్లాడడంతో ఇవన్నీ చూసి ప్రతిదానికి నవ్వడం అలవాటు చేసుకున్నారా అని ఆమెను ప్రశ్నిస్తే వాళ్ళు ఏదో కామెంట్ చేయడం దానికి నేను ప్రతిస్పందనగా మాట్లాడడం మళ్ళీ వాళ్ళు దానికి కామెంట్ చేయడం ఇది ఒక నిరంతర ప్రక్రియలా జరుగుతోందని అన్నింటికీ ఏడుస్తూ కూర్చోలేనని రమ్య పేర్కొన్నారు. ఇక అలాగే తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి మరో కారణం ఉందని కొన్ని మీడియా ఛానల్స్ లో మా ఇద్దరికీ విడాకులు అయిపోయాయి అని ప్రచారం జరుగుతోంది కానీ అందులో నిజం లేదని ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుతానికి మా విడాకుల ప్రక్రియ కోర్టులో కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు. అంతేకాక విడాకులు కావాలి అని తాను కోరలేదని నా నుంచి విడాకులు కావాలి అని నరేష్ కోరారు అని రెండు దఫాలు నాకు నోటీసులు కూడా పంపకుండానే విడాకుల ప్రక్రియ పూర్తి చేయాలని నరేష్ భావించారని దేవుడి దయవల్ల చివరి నిమిషంలో తాను కోర్టులో హాజరవుతూ వచ్చానని పేర్కొన్నారు. మరి నరేష్ పవిత్ర నిజంగా పెళ్లి చేసుకోబోతున్నారా? లేక అవి ప్రమోషన్స్ మాత్రమేనా? అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read: Waltair Veerayya Pre Release Event: 'వాల్తేరు వీరయ్య' యూనిట్ కు షాక్.. ఆర్కే బీచ్లో అనుమతి లేదంటూ!

Also Read: Kandukuru TDP Incharge: కందుకూరు తొక్కిసలాట ఘటన.. ఇంచార్జ్ ఇంటూరి అరెస్ట్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News