Mohan Babu Cash Theft Case: గంటల వ్యవధిలోనే సినీ నటుడు మంచు మోహన్ బాబు పరిష్కారమైంది. ఆగమేఘాల మీద పోలీసులు స్పందించి దొంగను పట్టుకున్నారు. అలా ఫిర్యాదు చేశారో లేదో ఇలా కొన్ని గంటలలోనే పరిష్కారం చేసి సొత్తును రికవరీ చేశారు. ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కారం చూపిన పోలీసులు ప్రత్యేకత సాధించారు. అయితే పోలీసులు స్పందించిన తీరుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Also Read: Sobhita Chaitanya: నాకు నాగచైతన్యతో పిల్లలు కనాలని ఉంది: శోభిత ధూళిపాల
ఏం జరిగింది?
రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి గ్రామంలో మంచు టాన్‌షిప్‌లో మోహన్ బాబు వ్యక్తిగత కార్యదర్శిగా కిరణ్ కుమార్ పని చేస్తుంటాడు. ఈనెల 22వ తేదీన తిరుపతి నుంచి మోహన్ బాబు ఎంబీయూ విశ్వవిద్యాలయం నుంచి రూ.10 లక్షల నగదు తీసుకొచ్చాడు. జల్‌పల్లిలోని మంచు టౌన్‌షిప్‌లోని తన గదిలో ఉంచి రాత్రి నిద్రపోయాడు. అయితే 23వ తేదీ సోమవారం ఉదయం లేచి చూసేసరికి డబ్బులు కనపడలేదు. వెంటనే మోహన్ బాబుకు ఫిర్యాదు చేశారు. అనంతరం సీసీ కెమెరా పరిశీలించారు.
Also Read: Mohan babu: మోహన్ బాబు ఇంట్లో భారీ చోరీ..మరోసారి వాళ్ల పనే..
ఆగమేఘాలపై
అయితే అక్కడ పనిచేసే గణేశ్ నాయక్‌పై అనుమానం వ్యక్తం చేశారు. తన గదిలోకి వచ్చి వెళ్లినట్లుగా సీసీ కెమెరాలో ఉందని తెలిపాడు. అతడిపై అనుమానం వ్యక్తం చేస్తూ పహాడీ షరీఫ్ పోలీసులకు మోహన్ బాబు పీఏ కిరణ్ కుమార్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సూచనల మేరకు సత్వర విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడి ఆచూకీ కోసం పోలీసు బలగాలు తీవ్రంగా ప్రయత్నం చేశాయి.
ప్రత్యేక దృష్టి
ఈ క్రమంలో అనుమానితుడు గణేశ్ నాయక్ ఆచూకీ తిరుపతిలో లభించింది. ఒక బృందాన్ని అక్కడకు పంపించి అతడిని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. అతడి నుంచి రూ.7,36,400 నగదు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్‌కు పంపారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ కేసు పరిష్కరించడం విశేషం. అయితే ఈ కేసుపై పోలీసులు తీసుకున్న చొరవపై విమర్శలు వస్తున్నాయి. ప్రముఖుల కేసును సత్వర పరిష్కారం చూపే పోలీసులు సామాన్యుల కేసులపై ఎందుకు ఇంత శ్రద్ధ చూపారని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నిస్తున్నారు. పోలీసుల వీఐపీల సేవలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter