Actor karthi apology to pawan kalyan: తిరుమల లడ్డుపై ఇటీవల ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తీ వెటకారంగా మాట్లాడారు. లడ్డు కావాలా నాయన..అని యాంకర్ ప్రశ్నించగా.. ఇది సెన్సిటివ్ ఇష్యూ అని అపహాస్యంగా మాట్లాడారు.దీంతో ఇది కాస్త వివాదంగా మారింది. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ .. ఈరోజు ఇంద్రకీలాద్రిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
Bangaram anna nuvu @karthi_offl #Karthi pic.twitter.com/nYaWMZRg2Y
— Babu Nuvu Btech Ah (@BabuNuvuBtechAh) September 24, 2024
సనాతన ధర్మం మీద మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. అంతేకాకుండా.. హీరో కార్తీక్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. నటుడిగా ఆయనంటే గౌరవముందని, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం సరికాదన్నారు. ఈ నేపథ్యంలో కార్తీ వ్యాఖ్యలు పెనుదుమారంగా మారాయి. దీనిపై తాజాగా, హీరో కార్తీక్ ఎక్స్ వేదికగా స్పందించారు.
తనకు తిరుమల శ్రీవారంటే ఎంతో భక్తి అని చెప్పుకొచ్చారు. తను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. హిందు సంప్రదాయాలంటే తనకు ఎంతో గౌరవమని కూడా చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలకు పవన్ కళ్యాన్ కు ఎక్స్ వేదికగా క్షమాపణలు కూడా కోరారు. దీంతో హీరో కార్తీ వివాదంకు ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకొవచ్చు. తిరుమల లడ్డు వివాదం ఏపీ రాజకీయాలో దుమారంగా మారింది. దీనిపై ఇటీవల వైసీపీకి చెందిన నేతలు సైతం చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆయన ఈ రోజున విజయవాడ ఇంద్రకీలాద్రి చేరుకున్నారు.
అక్కడ అమ్మవారి మెట్లను శుభ్రం చేశారు. మెట్లకు పసుపు,కుంకుమ బొట్లు సైతం పెట్టారు. ఆ తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. సనాతన ధర్మం పట్ల మాట్లడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రకాశ్ రాజ్, పొన్నవోలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అంతేకాకుండా.. సినిమా రంగంలోని వారు సైతం మాట్లాడేప్పుడు ఆలోచించి మాట్లాడాలన్నారు. ఇప్పటికే చంద్రబాబు దీనిపై స్పెషల్ గా సిట్ ను సైతం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.