ప్రభాస్ సినిమాలపై స్కూలు ప్రాజెక్టు చేసిన కుర్రాడు..!

అయితే ఆ కుర్రాడు ప్రభాస్ ఫ్యాన్ అయ్యుండచ్చు.. అందుకే తన రికార్డు బుక్ మొత్తం ప్రభాస్ ఫోటోలతో నింపేశాడు.

Last Updated : Jan 30, 2018, 11:58 AM IST
ప్రభాస్ సినిమాలపై స్కూలు ప్రాజెక్టు చేసిన కుర్రాడు..!

మీరు పదవ తరగతిలో ఉన్నప్పుడు ఏవైనా ప్రాజెక్టు వర్కు లేదా రికార్డు వర్క్ చేశారా..? సాధారణంగా ఇలాంటి పనులు ఇచ్చేటప్పుడు ఎవరైనా సైన్స్ ప్రాజెక్టులో, సోషల్ ప్రాజెక్టులో చేస్తారు. అయితే ఆ కుర్రాడు ప్రభాస్ ఫ్యాన్ అయ్యుండచ్చు.. అందుకే తన రికార్డు బుక్ మొత్తం ప్రభాస్ ఫోటోలతో నింపేశాడు. పైగా తెల్ల కాగితాలపై ప్రభాస్ జీవిత చరిత్ర మొత్తం వికీపీడియా నుండి కాపీ చేసి మక్కీకి మక్కీ రాసేశాడు.

అలాగే ఆ ప్రాజెక్టుకి తానే 10/10 మార్కులు కూడా వేసేసుకున్నాడు. ప్రభాస్‌ను పిచ్చిగా అభిమానించే ఆ ఫ్యాన్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రభాస్‌కి చిన్న పిల్లల్లో కూడా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే సినిమా పిచ్చి ముదిరి పాకాన పడితే.. చదువులు అటకెక్కుతాయన్నది కూడా వాస్తవమే కదా.

అందుకే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ప్రాజెక్టు ఫోటోలు నిజంగా ఆయన ఫ్యాన్ చేసిందా లేదా ఎవరైనా కావాలని తయారు చేసి పెట్టారా అన్నది కూడా తెలియాల్సిన విషయమే. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫన్నీ ఫన్నీ ఫోటోలు పెట్టడం కామన్ అయిపోయింది కాబట్టి.. ఇది కూడా అలాంటిదే అయ్యుంటుంది అని కొందరు కొట్టిపారేయడం సహజమే కదా

Trending News