లాక్డౌన్ ( Lockdown ) కారణంగా ఓవర్ ది టాప్ ప్లాట్ ఫామ్స్ ( Over the top platforms ) బాగా ఆదరణ పొందాయి. ధియేటర్లు మూతపడటంతో ప్రేక్షకుల వినోదానికి ఇవే కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రారంభం కానుంది.
ఓవర్ ది టాప్ ప్లాట్ ఫామ్ సంక్షిప్తంగా ఓటీటీ ( OTT ) . దీని గురించి మొన్నటి వరకూ తెలియనివారికి కూడా కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా బాగా తెలిసింది. ఎన్ని ఓటీటీలు మార్కెట్లో ఉన్నాయనేది కూడా తెలిసిపోయింది. ఎందుకంటే ధియేటర్లు మూతపడటంతో ప్రేక్షకులకు ఇవే వినోదాన్ని అందించాయి. కొన్ని సినిమాలు సైతం ఇందులో విడుదలయ్యాయి లాక్డౌన్ సమయంలో. ఈ క్రమంలో తెలుగులో పలు ఓటీటీ యాప్స్ తెరపైకి వస్తున్నాయి. మరో నాలుగు రోజుల్లో అంటే..నవంబర్ 1వ తేదీన ఫిలిమ్ ( Filim ) పేరుతో ఓ ఓటీటీ ( New OTT Filim ) ప్రారంభం కానుంది.
ఫిలిమ్ ఓటీటీ ( Filim OTT ) లో కొత్త సినిమాల ప్రీమియర్లు, ఇండిపెండెంట్ మూవీస్, వెబ్ సిరీస్లను అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రేక్షకులకు భిన్నమైన కంటెంట్ అందించేందుకు వస్తున్న ఫిలిమ్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ ( Google play store ) నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 1న ప్రారంభం కానున్న ఈ ఓటీటీలో తొలి మూవీగా పిజ్జా 2 ప్రీమియర్ విడుదలవుతోంది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహించగా..గాయత్రి హీరోయిన్గా నటించింది. మరోవైపు త్రిష నటించిన హే జ్యూడ్, మలయాళ స్టార్ మమ్ముట్టి నటించిన రంగూన్ రౌడీ, ప్రియమణి నటించిన థ్రిల్లర్ మూవీ, విస్మయ, ధృవ, జేడీ చక్రవర్తి నటించిన మాస్క్ తదితర చిత్రాలు కూడా ఫిలిమ్ ఓటీటీలో రానున్నాయి.
ఇక వెబ్ సిరీస్ ( Web series ) ల విషయానికొస్తే ఓయ్ బేబీ, వెనీలా, ఓమ్ ( ఓన్లీ మనీ )లతో పాటు సూపర్ హిట్ సినిమాలైన రుధిరం, గాడ్ ఫాదర్, ఇష్క్, వెంకీ, ఢీ, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బద్రి, అతిథి, నీ స్నేహం, గమ్యం చిత్రాలన్నీ అందుబాటులో ఉండనున్నాయి. మార్కెట్లో ఉన్న మిగిలిన ఓటీటీల కంటే తక్కువ సబ్ స్ర్కిప్షన్ కు అందించనున్నామని నిర్వాహకులు తెలిపారు. కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే వస్తున్న తొలి ఓటీటీ అని నిర్వాహకులు చెబుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అమెజాన్ ప్రైమ్ ( Amazon prime ), జీ 5 ( Zee 5 ) , నెట్ ఫ్లిక్స్ ( Netflix ), హాట్ స్టార్ ( Hotstar ), ఆహా, వూట్ ఓటీటీల్లో తెలుగు కూడా అందుబాటులో ఉంది. కానీ కేవలం తెలుగు ప్రేక్షకులే టార్గెట్ గా తెలుగులోనే వస్తుంది ఫిలిమ్. Also read: RRR NTR Teaser Spoof: కుర్రాళ్లు అదరగొట్టేశారు.. RRR నిర్మాత ఫిదా