'ఏ మంత్రం వేసావె' మూవీ రివ్యూ

'ఏ మంత్రం వేసావె' మూవీ రివ్యూ.. మీ కోసం

Last Updated : Mar 9, 2018, 06:16 PM IST
'ఏ మంత్రం వేసావె' మూవీ రివ్యూ

నటీ నటులు : విజయ్ దేవరకొండ, శివానీసింగ్,శివన్నారాయణ, రాజబాబు, నీలాక్షిసింగ్, ఆశిష్‌రాజ్, ప్రభావతి, దీపక్ తదితరులు

సంగీతం: అబ్భత్ సమత్
చాయాగ్రహణం : శివారెడ్డి
సమర్పణ :మల్కాపురం శివకుమార్( సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ )
నిర్మాణం : గోలీసోడా ఫిలిమ్స్
కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం : శ్రీధర్ మర్రి
రిలీజ్ డేట్ : 9 మార్చ్ 2018
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో హీరోగా క్రేజ్ సంపాందించుకున్న విజయ్ దేవరకొండ నటించిన ‘ఏ మంత్రం వేసావె’ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
శ్రీధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేసిందో తెలుసుకుందాం….

కథ :
గేమింగ్, చాటింగ్ అంటూ సోషల్ మీడియాకి విపరీతంగా అడిక్ట్ అయి అదే ప్రపంచంగా జీవిస్తుంటాడు నిఖిల్(విజయ్ దేవరకొండ). సోషల్ మీడియా ద్వారా నిఖిల్ జీవితంలోకి రాగ్స్(శివాని సింగ్) అనే అమ్మాయి ఎంటరవుతుంది. తనతో వీడియో ఛాటింగ్ చేస్తూ తన గురించి ఎలాంటి వివరాలు తెలియకుండానే ప్రేమలో పడతాడు నిఖిల్. ఈ క్రమంలో ఓ గేమ్ పేరుతో నిఖిల్ ను సోషల్ మీడియా ప్రపంచం నుంచి బయటికి తీసుకొస్తుంది రాగ్స్. అయితే నిఖిల్ తో రాగ్స్ ఏం గేమ్ ప్లే చేసింది. చివరికీ సోషల్ మీడియానే ప్రపంచంగా భావించే నిఖిల్ దాని నుంచి ఏం తెలుసుకున్నాడు.. అసలింతకీ రాగ్స్ ఎవరు..? చివరికి వీరిద్దరూ ఎలా ఒకటయ్యారు. అనేది మిగతా కథ.
నటీ నటులు :
విజయ్ దేవరకొండ తన పెర్ఫార్మెన్స్- డైలాగ్ డెలివరీ తో ఆకట్టుకున్నాడు. సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన కుర్రాడిగా నటించి సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు. శివాని తన పెర్ఫార్మెన్స్ తో ఓకే అనిపించుకుంది. శివన్నారాయణ, రాజబాబు, నీలాక్షిసింగ్, ఆశిష్‌రాజ్, ప్రభావతి, దీపక్ తదితరులు తమ క్యారెక్టర్స్ తో పరవాలేదనిపించుకున్నారు.
 

టెక్నిషియన్స్ పనితీరు :
అబ్భత్ సమత్ అందించిన సంగీతం, శివారెడ్డి సినిమాటోగ్రఫీ జస్ట్ పరవాలేదనిపించేలా ఉన్నాయి తప్ప సినిమాకు ప్లస్ అయ్యేలా అనిపించలేదు. ఎడిటింగ్ బాగుంది. డైలాగ్స్ ఆకట్టుకోలేకపోయాయి. శ్రీధర్ మర్రి స్క్రీన్ ప్లే బోర్ కొట్టిస్తుంది. డైరెక్షన్ కూడా వీక్ అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ లేవు.

సమీక్ష :
‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నుండి ఓ సినిమా వస్తుందంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి … కాని ఈ సినిమాకు సంబందించి ఎలాంటి అంచనాలు లేవు. కాని కారణం విజయ్ కెరీర్ స్టార్టింగ్ లో చేసిన సినిమా కావడం.. పైగా ట్రైలర్ ,సాంగ్స్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయకపోవడమే.. కాని అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ నుండి వస్తున్న సినిమా కావడంతో బిజినెస్ పరంగా కాస్త క్రేజ్ తెచ్చుకుందీ సినిమా.
నిజానికి విజయ్ ‘పెళ్లిచూపులు’ కంటే ముందే చేసిన సినిమా ఇది. 2015 లో స్టార్ట్ అయిన ఈ సినిమా దాదాపు రెండేళ్ళు ఆలస్యంగా రిలీజ్ అవ్వడంతో హీరో కూడా ఈ సినిమాను లైట్ తీసుకున్నాడు. అది ఈ సినిమాకు పెద్ద మైనస్. ఓ స్టార్డం ఉన్న హీరో తను నటించిన సినిమాను ప్రమోట్ చేయకపోవడం వెనుక చాలా రీజన్సే ఉంటాయి అలాగే ఈ సినిమాకి సంబంధించి కూడా ఏదో  స్ట్రాంగ్ రీజన్ ఉండే ఉంటుంది.
దర్శకుడు శ్రీధర్ మర్రి ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది.. కానీ తన స్క్రీన్ ప్లే తో సినిమాను ఎంగేజింగ్ గా తెరకెక్కించడంతో పూర్తిగా విఫలం అయ్యాడు. సోషల్ మీడియాలో జరుగుతున్న మోసాల పై ఇప్పటికే తెలుగులో కొన్ని సినిమాలొచ్చినప్పటికీ ఇది వాటికి కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలతో మరీ బోర్ కొట్టించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో మాత్రం కొన్ని సన్నివేశాలతో, ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో పరవాలేదనిపించాడు. సినిమా చూశాక ఈ కాన్సెప్ట్ ని ఇంకా బెటర్ గా ఎంగేజింగ్ గా చెప్పొచ్చు అనే ఫీల్ కలుగుతుంది.
విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్, శివాని క్యారెక్టర్, కాన్సెప్ట్, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్ లో ట్విస్ట్, క్లైమాక్స్ లో దర్శకుడు ఇచ్చిన సందేశం సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా, బోర్ కొట్టించే స్క్రీన్ ప్లే,నేరేషన్, డైలాగ్స్, బాగ్రౌండ్ స్కోర్, డైరెక్షన్ సినిమాకు మైనస్ అనిపిస్తాయి. ఫైనల్ గా ఏ మంత్రం వేసావె’ లైఫ్ ఈజ్ గేమ్ నో హౌ టు ప్లే ఇట్ అంటూ దర్శకుడు ప్రేక్షకులకు అందించిన సందేశాత్మక సినిమా.
 

రేటింగ్ 2/5 

Trending News