Radhe Shyam OTT offer: 'రాధేశ్యామ్' సినిమాకు కళ్లు చెదిరే ఓటీటీ ఆఫర్.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?

Radhe Shyam: ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకు అదిరిపోయే ఓటీటీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఎంతో తెలిస్తే మీరు అవాక్కవుతారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2022, 02:09 PM IST
Radhe Shyam OTT offer: 'రాధేశ్యామ్' సినిమాకు కళ్లు చెదిరే ఓటీటీ ఆఫర్.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?

Radhe Shyam OTT offer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తర్వాత ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం 'రాధేశ్యామ్' (Radhe Shyam). సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రపంపవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే కరోనా (Covid-19) నేపథ్యంలో...బడా చిత్రాలన్నీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటున్నాయి.

ఇప్పుడు 'రాధేశ్యామ్'​ రిలీజ్​పై కూడా సందిగ్ధత నెలకొంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కెర్లు కొడుతోంది. ఈ సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ (Radhe Shyam Digital Release) చేయడం కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ మెుత్తంలో ఆఫర్ చేసినట్లు సమాచారం. ఏకంగా రూ.300కోట్లు ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. 

Also Read: OTT Movies: మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్... ఈ నెలలో ఓటీటీ వేదికగా మూడు బడా చిత్రాలు రిలీజ్..!

అయితే ఈ సినిమాను నేరుగా థియేటర్లలోనే విడుదల చేస్తామని ఇటీవలే చిత్రబృందం స్పష్టం చేసింది. ఈ సినిమా రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డార్లింగ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురూచుస్తున్నారు.  

1970ల నాటి లవ్​స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. ప్రభాస్ సరసన పూజాహెగ్డే (Actress Pooja Hegde) హీరోయిన్​గా చేసింది. ఈ చిత్రంలో రెబల్​స్టార్ కృష్ణంరాజు ఓ కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. 

త్వరలో ప్రభాస్ రాధే శ్యామ్ (Prabhas Radhe Shyam) సినిమా విడుదలపై ఓ క్లారిటీ రానుంది. ఒక్కటి మాత్రం నిజం.. ప్రభాస్ లాంటి హీరో సినిమాను ఓటీటీలో విడుదల చేస్తే మాత్రం అంతకంటే సంచలనం మరోటి ఉండదు.

థియేటర్స్ ఉన్నా కూడా డిజిటల్ రిలీజ్ (OTT Release) చేస్తే.. ప్రేక్షకులు కూడా కరోనాను దాటి బయటికి వెళ్లరు. ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని సినిమా చూస్తారు. మరి అలా చేస్తే థియేటర్స్‌కు ఎంత నష్టం వస్తుందనేది కూడా అంచనాలు వేయలేరు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News