Wedding Cancelled In Uttar Pradesh: వివాహ వేడుకలో ఓ యువకుడు చేసిన ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. తన మాజీ ప్రియురాలు పెళ్లిని ఆపాలనే ఉద్దేశంలో మరికాసేపట్లో వివాహం జరుగుతుండగా.. వధువు నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టాడు. దీంతో వరుడు పెళ్లి క్యాన్సిల్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజిపుర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వధువు నుదుట బొట్టు పెట్టిన యువకుడిని కుటుంబ సభ్యులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాలు ఇలా..
బిరాన్ ప్రాంతంలోని భావ్రాహా గ్రామానికి ఓ యువకుడు, యువతి గతంలో ప్రేమించుకున్నారు. ఆ తరువాత వీడిపోయారు. ఆమెకు వేరే యుకువడితో పెళ్లి నిశ్చయం కావడంతో అతను తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా పెళ్లిలో ఏదో ఒకటి చేయాలని ముందే ప్లాన్ వేసుకున్నాడు. ఈ నెల 17న వివాహ వేడుక జరుగుతోంది. మరి కాసేపట్లో వధువు మెడలో వరుడు తాళి కట్టాల్సి ఉంది.
వధూవరులు ఒకరినొకరు దండలు మార్చుకుని.. వేడుక వద్దకు వస్తున్నారు. ఇంతలో వధువు మాజీ ప్రేమికుడు అక్కడి చేరుకుని.. వధువు నుదుటిపై సింధూరం పెట్టాడు. దీంతో అక్కడి ఉన్న వారంత ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీనిని గమనించిన పెళ్లి కొడుకు తనకు ఈ పెళ్లి వద్దంటూ చెప్పేశాడు. వరుడితోపాటు అతడి తరపు బంధువులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. వధువు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వారిని ప్రాధేయపడ్డారు. అనంతరం గ్రామంలో పంచాయితీ జరిగింది. గంటల తరబడి చర్చించినా.. వరుడు బంధవులు మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు.
పెళ్లి క్యాన్సిల్ అయ్యేందుకు కారణమైన యువకుడినికి పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. గత ఏడేళ్ల నుంచి యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు వారు తెలిపారు. నిందితుడు యువతి వీడియో తీసి బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడని చెబుతున్నారు. వధువు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
Also Read: Pawan Kalyan: ఏపీ సీఎం ఏ చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక: పవన్ కళ్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి