Uppal Stadium Match Tickets: ఉప్పల్ స్టేడియం టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్న వ్యక్తులు అరెస్ట్

Uppal Stadium Cricket Match Tickets: హైదరాబాద్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ ప్రియులు ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చింది. ఇండియా vs న్యూజిలాండ్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో నేడే వన్డే మ్యాచ్ జరగనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2023, 04:33 AM IST
Uppal Stadium Match Tickets: ఉప్పల్ స్టేడియం టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్న వ్యక్తులు అరెస్ట్

Uppal Stadium Cricket Match Tickets: హైదరాబాద్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ ప్రియులు ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చింది. ఇండియా vs న్యూజిలాండ్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో నేడే వన్డే మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియం తెలుగు వారికి హోమ్ గ్రౌండ్ కావడంతో ఇక్కడ జరిగే క్రికెట్ మ్యాచ్‌లు వీక్షించడం తెలుగు వారికి ఎప్పుడూ ప్రత్యేకమే. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉండే వారు ఈ అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లో వదులుకోవాలని అనుకోరు. అలాంటి వారినే లక్ష్యంగా చేసుకుని ఈజీ మనీ కోసం బ్లాకులో ఉప్పల్ స్టేడియం క్రికెట్ మ్యాచ్ టికెట్స్ అమ్ముతున్న వ్యక్తులు, ముఠాలను మంగళవారం ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

బుధవారం నాటి ఇండియా vs న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్ ఎంట్రీ కోసం 1250 రూపాయల టికెట్స్‌ని రూ 3 వేలకు అమ్ముతున్న 15 మందిని అరెస్ట్ చేసినట్టు ఉప్పల్ పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో 1) జి. రమేష్ వయస్సు 38, ఇసిఐఎల్, 2)కె. వేణు, 21 సంవత్సరాలు, ఆర్కేపురం, 3) టి. ఆశ్రిత్, 21 సంవత్సరాలు, ఆర్కే పురం, 4) రోహిత్, 20 సంవత్సరాలు, మన్సూరాబాద్, 5) ఉదయ్, 21 సంవత్సరాలు, మన్సూరాబాద్, 6) M. సంజీవ, 26 సంవత్సరాలు, జవహర్ నగర్, 7) కె. యశ్వంత్, 21 సంవత్సరాలు, రామంతపూర్, 8)మారుతి, వయస్సు 32 సంవత్సరాలు, గౌలిదొడ్డి, 9) జి. అరుణ్ రెడ్డి, వయస్సు 30 సంవత్సరాలు, బిహచ్ఇఎల్,  10) బి. సంతోష్, 26 సంవత్సరాలు, సిద్దిపేట, 11) ఎండీ ఆరిఫ్, 26 సంవత్సరాలు, సిద్దిపేట, 12) ఎల్. సాయిరాం, వయస్సు 28 సంవత్సరాలు, భరత్ నగర్ , 13) ఎ.రమేష్, వయస్సు: 28 సంవత్సరాలు, తిరుమలనగర్, 14) కె. రోహిత్, 28 సంవత్సరాలు, నాగేంద్ర నగర్, హబ్సిగూడ ఉన్నారు.

ఇది కూడా చదవండి : Mahindra XUV400 EV: మహింద్రా నుంచి మరో కొత్త బాహుబలి.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 456 కిమీ రేంజ్

ఇది కూడా చదవండి : Salary Hikes in 2023: జీతాల పెంపుపై ప్రైవేటు ఉద్యోగులకు పెద్ద గుడ్ న్యూస్

ఇది కూడా చదవండి : Govt Employees Basic Salary: ప్రభుత్వ ఉద్యోగులకు బడ్జెట్ 2023 తరువాత సూపర్ గుడ్ న్యూస్ ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News