Maharashtra Crime News: దీపావళికి బోనస్‌ ఇవ్వలేదని యజమాని దారుణ హత్య.. మృతుడి కారులోనే పారిపోయిన నిందితులు

Dhaba Owner Murder Case: దీపావళికి బోనస్ ఇవ్వలేదని యజమానిని దారుణంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. హత్య చేసిన అనంతరం నిందితులు మృతుడి కారులోనే పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Written by - Ashok Krindinti | Last Updated : Nov 12, 2023, 11:22 PM IST
Maharashtra Crime News: దీపావళికి బోనస్‌ ఇవ్వలేదని యజమాని దారుణ హత్య.. మృతుడి కారులోనే పారిపోయిన నిందితులు

Dhaba Owner Murder Case: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దీపావళి బోనస్ ఇవ్వనుందుకు దాబా యజమానిని అతని వద్ద పనిచేసే ఇద్దరు కార్మికులు కొట్టి చంపారు. శనివారం తెల్లవారుజామున నాగ్‌పూర్ రూరల్ పోలీస్ ఏరియాలోని కుహి ఫాటా సమీపంలోని ఓ దాబాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతుడు మాజీ సర్పంచ్‌ రాజు ధెంగ్రే కాగా.. నిందితులను మధ్యప్రదేశ్‌లోని మండ్లాకు చెందిన ఛోటు, ఆదిగా గుర్తించారు. నిందితులు ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివరాలు ఇలా..

రాజు ధెంగ్రే అనే వ్యక్తి  కుహి ఫాటా సమీపంలోని దాబా నిర్వహిస్తున్నాడు. అతని వద్ద మధ్యప్రదేశ్‌లోని మాండ్లాకు చెందిన ఛోటూ, ఆది అనే ఇద్దరు నెల రోజుల క్రితం నగరంలోని ఓ లేబర్ కాంట్రాక్టర్ ద్వారా పనిలో చేరారు. ఇటీవల అందరూ కలిసి భోజనం చేస్తుండగా.. వారిద్దరు రాజు ధెంగ్రేను దీపావళి సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరారు. అయితే ఇప్పుడు కుదరదని.. తరువాత ఇస్తానని చెప్పాడు. దీంతో తాము అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వలేదని నిందితులు కోపం పెట్టుకున్నారు. హత్య చేసి పారిపోవాలని ప్లాన్ వేశారు.

శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత.. ధెంగ్రే వెళ్లి మంచం మీద పడుకున్నాడు. అతని మెడకు తాడును బిగించి.. తలపై బండరాయితో ఇద్దరు నిందితులు కొట్టారు. అనంతరం పదునైన ఆయుధంతో దాడి చేసి.. అతడి ముఖాన్ని గుర్తుపట్టలేని విధంగా ఛిద్రం చేశారు. తరువాత ధెంగ్రే మృతదేహాన్ని ఓ బొంతలో కప్పిపెట్టారు. అక్కడి నుంచి మృతుడి కారులోనే పరార్ అయ్యారు. ధెంగ్రే కుమార్తె తండ్రికి ఫోన్ చేయగా.. స్పందన రాలేదు. పదేపదే చేసినా.. ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో ధాబా సమీపంలోని పాన్ షాప్ యజమానికి ఫోన్ చేసింది. అతను వచ్చి చూడడడంతో హత్య విషయం వెలుగులో వచ్చింది. 

కారులో వెళ్లిన నిందితులు విహిర్‌గావ్ సమీపంలోని నాగ్‌పూర్-ఉమ్రెడ్ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టి గాయపడ్డారు. పంచ్‌గావ్‌ నుంచి నాగ్‌పూర్‌కు వెళ్తున్న కారులో నుంచి ఇద్దరు దుండగులు దిగి దిఘోరి నాకా వైపు పారిపోతున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నామని.. రాజకీయం ప్రత్యర్థుల కుట్ర కోణం ఏమైనా ఉందా..? అని ఆరా తీస్తున్నామని ఎస్పీ హర్ష్ ఎ పొద్దార్ వెల్లడించారు. ప్రాథమికంగా ఆర్థికపరమైన కారణాలేనని తేలిందన్నారు. 

Also Read: Samsung Galaxy A25 5G Price: దీపావళి సందర్భంగా సాంసంగ్ గుడ్ న్యూస్‌..మార్కెట్‌లోకి మరో డ్రాప్ నాచ్‌ 5G మొబైల్‌!  

Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News