Trian Hit on Employees: మహారాష్ట్రలో ఘోరం.. పనులు చేస్తున్న ఉద్యోగులపై దూసుకొచ్చిన రైలు

Palghar Train Accident: సిగ్నలింగ్‌ వ్యవస్థలో లోపం తలెత్తడంతో పనులు చేస్తుండగా ఆ సమయంలో అకస్మాత్తుగా ఓ రైలు దూసుకొచ్చింది. అనుకోకుండా జరిగిన సంఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 23, 2024, 06:58 PM IST
Trian Hit on Employees: మహారాష్ట్రలో ఘోరం.. పనులు చేస్తున్న ఉద్యోగులపై దూసుకొచ్చిన రైలు

Maharashtra Train Accident మహారాష్ట్రలోని పాలఘర్‌ జిల్లా పరిధిలోని వాసయి రోడ్డు, నైగావ్‌ స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై సిగ్నల్‌ సమస్య తలెత్తింది. సిగ్నళ్లు పని చేయకపోవడంతో ఇంజనీర్లకు సమాచారం ఇచ్చారు. ఈనెల 22న సోమవారం సాయంత్రం కొంతమంది ఉద్యోగులు మరమ్మతులు చేసేందుకు వచ్చారు. రాత్రి 8.55 గంటల సమయంలో సిగ్నల్‌ పని చేస్తున్న వారిపై చర్చ్‌ గేట్ వైపు వెళ్తున్న లోకల్‌ రైలు దూసుకెళ్లింది. పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. 

మృతుల వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ రైల్వే విభాగానికి చెందిన చీఫ్‌ సిగ్నలింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ వాసుమిత్ర, ఎలక్ట్రికల్‌ సిగ్నలింగ్‌ మెయింటైనర్‌ సోమనాథ్ ఉత్తమ్‌, హెల్పర్‌ సచిన్‌ వాంఖడేగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరగడంపై రైల్వే అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టారు. రాత్రిపూట చీకటి వలన రైలును గుర్తించలేదని తెలిసింది. పని చేస్తున్న సమయంలో వస్తున్న రైలును గుర్తించకపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ తక్షణ సహాయంగా రూ.55 వేలు ఆర్థిక సహాయం ప్రకటించింది.

Also Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?

Also Read: Mizoram Flight: ఎయిర్‌పోర్టులో జారిన విమానం.. పొదల్లోకి దూసుకెళ్లడంతో 12 మందికి గాయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News