Sharon Raj Killed by Girlfriend: చచ్చిపోతావన్నా వినలేదని చంపేసింది.. కలకలం రేపుతున్న ఇంటర్ స్టేట్ లవ్ స్టోరీ!

Student poisoned by girlfriend in Kerala : తాను బ్రేకప్ చెప్పినా వదలకుండా పెళ్లి చేసుకోమంటున్నాడనే కారణంగా తమిళనాడుకు చెందిన ఒక అమ్మాయి తన ప్రియుడిని దారుణంగా హతమార్చింది. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 31, 2022, 04:04 PM IST
Sharon Raj  Killed by Girlfriend: చచ్చిపోతావన్నా వినలేదని చంపేసింది.. కలకలం రేపుతున్న ఇంటర్ స్టేట్ లవ్ స్టోరీ!

Student poisoned by girlfriend: తాజాగా కేరళకు చెందిన ఒక యువకుడు మృత్యువాత పడిన ఘటన చర్చనీయాంశమైంది. సినిమాలను చూసి రియల్ లైఫ్ లో నేరాలకు పాల్పడుతున్నారో లేక నిజంగా జరుగుతున్న నేరాలు చూసి సినిమాలు తీస్తున్నారో తెలియదు కానీ ప్రతి క్రైమ్ వెనుక సినిమా స్టోరీ లాంటి కోణం కనిపిస్తోంది. తాజాగా కేరళ రాజధాని తిరువనంతపురానికి చెందిన యువకుడు అనూహ్య పరిసతుల్లో మృత్యువాత పడిన ఘటన కలకలం రేపుతోంది.

తిరువనంతపురం లోని పరసాల అనే ప్రాంతానికి చెందిన షారోన్ రాజు తమిళనాడుకు చెందిన గ్రీష్మ సుమారు ఏడాది నుంచి ప్రేమించుకున్నారు. వారిద్దరికీ వివాదం ఏర్పడడంతో విడిపోయారు. కానీగ్రీష్మ మరో పెళ్లికి సిద్ధమవుగా షారోన్ రాజు మాత్రం ఆమె తననే పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడ్డాడు. అయితే అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని గ్రీష్మ తనను పెళ్లి చేసుకున్న మొదటి భర్త చనిపోతాడని జ్యోతిష్యుడు చెప్పాడు కాబట్టి మనిద్దరం వివాహం చేసుకుంటే నీ ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించింది.

అయినా సరే షారోన్ రాజు వినకుండా ఆమెని పెళ్లి చేసుకుంటానని వెంట పడుతూ ఉండేవాడు. దీంతో ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పగా షారోన్ రాజుని చంపి అడ్డు తొలగించుకోవాలని ఫిక్స్ అయ్యారు. పెళ్లికి అంతా మాట్లాడి ఉంచాను నువ్వు కూడా మాట్లాడాలని చెప్పి కన్యాకుమారి షారోన్ రాజును పిలిపించుకున్న గ్రీష్మ ఇంటికి వచ్చిన తర్వాత మా సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుందామని గ్రీష్మ షారోన్ కు కుంకుమ బొట్టు కూడా పెట్టినట్లు తెలుస్తోంది.  ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి కూల్డ్రింక్ తాగే పోటీ పేరుతో ఒక ఆయుర్వేదిక్ డ్రింక్ లో ఒక విషాన్ని కలిపినట్లు తెలుస్తోంది.  

అయితే ఆ విషం స్లో పాయిజన్ కావడంతో సుమారు 15 రోజులు పాటు షారోన్ నరకయాతన అనుభవించాడు. రోజుకు ఒక అవయం అవయవం పనిచేయడం మానేయడంతో చివరికి మృత్యువాత పడ్డాడు. నిజానికి డ్రింక్ తాగిన వెంటనే అతనికి వాంతి అయింది గానీ ఇలా విష ప్రయోగం జరిగిందనే విషయాన్ని గ్రహించలేక పోయాడు. అయితే అది తాగి ఇంటికి వచ్చిన తర్వాత నుంచి షారోన్ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటూ ఉండడంతో షారోన్ సోదరుడు అనేకసార్లు గ్రీష్మకి ఫోన్ చేసి అసలు అతనికి ఏమైనా ఇచ్చారా? అని అంటూ అడిగే ప్రయత్నం చేశాడు.

కానీ భయంతో గ్రీష్మ ఏమాత్రం చెప్పలేదు. ఇక ఈ విషయం మీద షారోన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గ్రీష్మను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ఎనిమిది గంటల పాటు విచారిస్తే కానీ ఆమె అసలు విషయం బయట పెట్టలేదు. ఇక ఈ వ్యవహారం అంతా తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. ప్రస్తుతానికి ఆమెను రిమాండ్ కు తరలించి దర్యాప్తు చేపట్టారు.

Also Read: Janhvi Kapoor Hot Pics: జాన్వీ కపూర్ అందాల జాతర.. చీరకట్టులో హాట్ పోజులిచ్చిన జూనియర్ శ్రీదేవి!

Also Read: SSMB 28 Update: మా సినిమా ఆగలేదోచ్.. మహేష్ మూవీపై నిర్మాత ఆసక్తికర ట్వీట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News