Shraddha Murder Case Update: నార్కో టెస్టులో అఫ్తాబ్ బయటపెట్టిన నిజాలు ఇవే.. ఆ విషయం చెప్పేశాడు

Aftab Poonawala Narco Test Result: శ్రద్ధా వాకర్ హత్య కేసులో  నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు నార్కో టెస్టు పూర్తయింది. ఈ పరీక్షలో అతను అన్ని విషయాలను బయటపెట్టాడు. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2022, 05:09 PM IST
Shraddha Murder Case Update: నార్కో టెస్టులో అఫ్తాబ్ బయటపెట్టిన నిజాలు ఇవే.. ఆ విషయం చెప్పేశాడు

Aftab Poonawala Narco Test Result: శ్రద్ధా వాకర్ హత్య కేసులో  నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా నార్కో టెస్టులో సంచలన విషయాలు బయటపెట్టాడు. ఢిల్లీ పోలీసుల ముందు జరిగిన విచారణలో హత్య కథనాన్ని మొత్తం చెప్పానని.. తాను మొదటి నుంచి నిజమే చెబుతున్నానని అన్నాడు. తాను ఎలాంటి అబద్ధం చెప్పలేదన్నాడు. తన లివ్ ఇన్ పార్ట్‌నర్ శ్రద్ధా వాకర్‌ను హత్య చేసి 35 ముక్కలుగా నరికినట్లు అంగీకరించిన అఫ్తాబ్.. హత్యానంతరం ఆ ముక్కలతో ఏం చేశాడో చెప్పాడు. ఢిల్లీలోని రోహిణి ఆస్పత్రిలో అఫ్తాబ్‌కు నార్కో టెస్టు రెండు గంటలపాటు నిర్వహించారు.

అఫ్తాబ్ తన స్నేహితురాలిని చంపావా..? అని ప్రశ్నించగా.. దానికి అతను 'అవును, నేను ఆమెను చంపాను. శ్రద్ధా నా నుంచి విడిపోవాలనుకున్నేందుకే కోపం వచ్చి హత్య చేశాను. ఆ తరువాత శ్రద్ధా మృతదేహాన్ని ముక్కలుగా నరికి విసిరేశాను..' అని అఫ్తాబ్ చెప్పాడు.
మృతదేహాన్ని ఏ ఆయుధంతో ముక్కలు చేసి.. రంపాన్ని ఎక్కడ పడేశారని అడగ్గా.. శ్రద్ధా మృతదేహాన్ని ముక్కలుగా నరికేందుకు చైనీస్ హెలికాప్టర్ అనే కత్తిని కూడా ఉపయోగించానని చెప్పాడు. దీంతో పాటు గురుగ్రామ్‌లోని పొదల్లో ఆ రంపాన్ని తానే విసిరినట్లు అఫ్తాబ్ నార్కో పరీక్షలో అంగీకరించాడు.

మీరు తల ఎక్కడ విసిరారు..? అని ప్రశ్నించగా.. మెహ్రౌలీ అడవుల్లోనే శ్రద్ధా తలను తానే విసిరినట్లు అఫ్తాబ్ వెల్లడించాడు. ఢిల్లీ పోలీసులు ఇంకా కనిపెట్టలేకపోయిన శ్రద్ధా ఫోన్‌ను ముంబైలోని సముద్రంలో అఫ్తాబ్ విసిరినట్లు తెలిసింది.

నార్కో పరీక్ష పూర్తిగా విజయవంతమైందని.. పరీక్ష ప్రక్రియ కూడా పూర్తయిందని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు. అఫ్తాబ్ ఆరోగ్యం కూడా బాగానే ఉందని చెప్పారు. ఢిల్లీలోని తీహార్ జైలులో నిందితుడు అఫ్తాబ్ పోస్ట్ నార్కో టెస్ట్ ఇంటర్వ్యూలో సుమారు 1 గంట 45 నిమిషాల పాటు ప్రశ్నలు అడిగారు. 

ఈ పరీక్ష ఎఫ్‌ఎస్‌ఎల్ కార్యాలయంలో జరగాల్సి ఉండగా.. అఫ్తాబ్‌ను పదే పదే తీసుకురావడంలో భద్రత దృష్ట్యా, నలుగురు ఎఫ్‌ఎస్‌ఎల్ సభ్యుల బృందం, కేసు దర్యాప్తు అధికారి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో అఫ్తాబ్ ముఖంలో ఎలాంటి భయం కనిపించలేదని వర్గాలు చెబుతున్నాయి.

Also Read: EPF Service: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఈ పనిని పూర్తిచేయండి.. లేకపోతే..!

Also Read: WhatsApp: వాట్సాప్‌లో పొరపాటున ఫొటోలు డిలీట్ చేశారా..? ఈ ట్రిక్స్‌తో తిరిగి పొందండి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Old Pension SchemeNew Pension SchemeOld PensionOpsNPS

Trending News