Shraddha Murder Case: నాతో శ్రద్దా చెప్పిన చివరి మాట అదే.. మీడియా ముందుకు శ్రద్ధా తండ్రి.. పోలీసులపై సంచలన వ్యాఖ్యలు

Shraddha Father Vikas Walkar: శ్రద్దా తండ్రి వికాస్ వాకర్ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. శ్రద్ధా తనతో చెప్పిన చివరి మాటలను చెప్పారు. అఫ్తాబ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2022, 03:13 PM IST
  • తొలిసారి మీడియా ముందుకు వచ్చిన శ్రద్దా తండ్రి
  • ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ
  • అప్పుడు పోలీసులు సహకరించలేదు
Shraddha Murder Case: నాతో శ్రద్దా చెప్పిన చివరి మాట అదే.. మీడియా ముందుకు శ్రద్ధా తండ్రి.. పోలీసులపై సంచలన వ్యాఖ్యలు

Shraddha Father Vikas Walkar: శ్రద్దా హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు 14 రోజుల పాటు పొడిగించింది. మరోవైపు శుక్రవారం శ్రద్దా తండ్రి వికాస్ వాకర్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. శ్రద్దా మరణంతో తమ కుటుంబం మొత్తం బాధలో ఉందన్నారు. కూతురి హత్యతో తన మానసిక పరిస్థితి కూడా క్షీణించిందన్నారు. అఫ్తాబ్‌ను కఠినంగా శిక్షించాలని.. అతని కుటుంబాన్ని కూడా విచారించాలని డిమాండ్ చేశారు. తన కూతురి హత్య వెనుక వాళ్ల హస్తం కూడా ఉన్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

శ్రద్దా కుటుంబం ఈరోజు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసింది. అనంతరం ఆయనతో మాట్లాడుతూ.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, దేవేంద్ర ఫడ్నవీస్, ఢిల్లీ పోలీసులు తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. పోలీసు శాఖలోని కొందరి నుంచి కూడా తనకు సాయం అందలేదని, అందుకు తాను కూడా చాలా బాధపడ్డానని చెప్పారు. విచారణలో పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తున్నామని తెలిపారు.

వసాయ్ పోలీసులపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. వసాయ్ పోలీసుల వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డానని, వారు సహాయం చేసి ఉంటే ఈరోజు తన కూతురు బతికే ఉండేదని వికాస్ వాకర్ చెప్పారు. శ్రద్దా దురదృష్టకర మరణాన్ని ఎప్పటికీ మరచిపోలేమని అన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన కాలంలో విచారణ జరిపి ఉంటే తన కూతురు బతికే ఉండేదన్నారు.

'నా కూతురిని కిరాతకంగా చంపిన అఫ్తాబ్ పూనావాలాను ఉరితీయాలి. ఈ విషయాన్ని లోతుగా విచారించాలి. అఫ్తాబ్‌ను ప్రోత్సహించిన వారిని కనిపెట్టాలి. నా కూతురు మైనార్టీ తీరిపోవడంతో నన్ను ఎదురించి ఇల్లు వీడిచి వెళ్లిపోయింది. నేను ఏమీ చేయలేనని వెళ్లే ముందు నా కుమార్తె నాకు చెప్పింది. శ్రద్ధాతో నాతో చివరగా 2021 సంవత్సరంలో మాట్లాడింది. అప్పుడు తాను బెంగళూరులో ఉన్నానని మరియు పూర్తిగా క్షేమంగా ఉన్నానని తెలిపింది. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో.. అఫ్తాబ్ తమ వర్గానికి చెందిన వాడిని కాదని శ్రద్ధాకు మాత్రమే చెప్పాను. అందుకే వారి పెళ్లికి వ్యతిరేకించాను. అఫ్తాబ్ శ్రద్ధాను కొట్టేవాడని కూడా నాకు తెలియదు..' అంటూ వికాస్ వాకర్ మీడియా ముందు చెప్పుకొచ్చాడు. 

మే నెలలో ఢిల్లీలోని మెహ్రౌలీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో శ్రద్ధా వాకర్‌ను హత్య చేసినట్లు 28 ఏళ్ల అఫ్తాబ్‌ హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత శ్రద్ధాను 35 ముక్కలుగా నరికి, ముక్కలను ఢిల్లీలోని నగరంలోని అనేక ప్రాంతాల్లో విసిరాడు. అఫ్తాబ్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నాడు. శుక్రవారం కోర్టులో హాజరుపరచగా.. జ్యుడీషియల్ కస్టడీని కోర్టు 14 రోజులపాటు పొడిగించింది. అఫ్తాబ్‌కు పాలిగ్రాఫ్‌ టెస్ట్‌, నార్కో టెస్ట్‌ చేశారు. అయితే ఇప్పటికీ ఈ కేసులో అపరిష్కృతంగా ఉన్న కొన్ని అంశాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.

Also Read: Ind Vs Ban: టీమిండియాలో కీలక మార్పు.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్‌కు పిలుపు  

Also Read: CM KCR: హైదరాబాద్ చుట్టూ మెట్రో రైల్.. సీఎం కేసీఆర్ మరో గుడ్ న్యూస్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News