Maharashtra: యూట్యూబ్ చూసి బిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక.. ఆ తర్వాత శిశువును ఏం చేసిందంటే?

Maharashtra: ఓ మైనర్ యూట్యూబ్ చూసి ప్రసవం చేసుకున్న ఘటన నాగ్‌పూర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుట్టిన శిశువును వెంటనే గొంతునులిమి హతమార్చింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2023, 09:23 AM IST
Maharashtra: యూట్యూబ్ చూసి బిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక.. ఆ తర్వాత శిశువును ఏం చేసిందంటే?

Nagpur Crime news: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలిక తాను గర్భవతి అనే సమాచారాన్ని దాచిపెట్టి ఇంట్లో ఎవరూ లేని సమయంలో యూట్యూబ్ వీడియో చూసి ప్రసవించింది. బిడ్డ జన్మించిన వెంటనే ఆ శిశువును గొంతునులిమి చంపేసింది. నాగ్‌పూర్‌లోని అంబాఝరి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

ఏం జరిగింది?
నాగ్‌పూర్‌లోని అంబాఝరి ప్రాంతంలో నివసిస్తున్న పదిహేనేళ్ల బాలిక 9వ తరగతి చదువుతోంది. ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్ లో ఠాకూర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో వీరిద్దరికి ఒకరిపై ఒకరికి ఇష్టం పెరిగింది. ఒక రూంకు తీసుకెళ్లి ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు. ఫలితంగా ఆ బాలిక గర్బం దాల్చింది. అయితే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పకుండా దాచిపెట్టింది. 

ఈ క్రమంలో శుక్రవారం ఆమెకు నొప్పులు రావడంతో యూట్యూబ్ చేసి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ శిశువును గొంతు నులిమి చంపి.. మృతదేహాన్ని ట్రేలో దాచిపెట్టింది. బాలిక ఆరోగ్యం క్షీణించడంతో ఆరా తీసిన తల్లికి అసలు నిజం చెప్పింది. ఈ విషయంపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శిశువు డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. 

Also Read: Varanasi: కాశీలో ప్రసాదంగా 'మిల్లెట్‌ లడ్డూలు'.. 'శ్రీ అన్న ప్రసాదం'గా పేరు మార్పు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News