Nursing School Bus Accident in Nalgonda: నల్గొండ జిల్లా నకిరేకల్ శివారులో కాలేజీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా సూర్యాపేట పీజీఎఫ్ నర్సింగ్ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. నల్గొండకు వెళ్తుండగా.. హైదరాబాద్-విజయవాడ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
సూర్యాపేటకు చెందిన భవాని స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులకు నల్గొండలో సోమవారం పరీక్షలు ఉన్నాయి. పరీక్షలు రాసేందుకు స్టూడెంట్స్ అందరూ కాలేజ్ బస్సులో బయలుదేరారు. నకిరేకల్ శివారులో హైవే నుంచి నల్గొండ వైపు రోడ్డు టర్న్ తీసుకుంటుండగా.. ఎదురుగా లారీ వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు పల్టీలు బోల్తా పడింది. బస్సు ప్రమాదానికి డ్రైవర్ అతివేగమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆక్యూపెన్సీకం మించి స్టూడెంట్స్ బస్సులో ఉన్నట్లు తెలిసింది. గాయపడ్డ విద్యార్థులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Happy Birthday Rajinikanth: రజినీకాంత్ కోసం శ్రీదేవి ఏడు రోజులు ఉపవాసం.. కారణం తెలుసా..!
Also Read: CM KCR Delhi Tour: నేడు సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్.. అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్న గులాబీ బాస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook