Last Rites: డబ్బుల్లేక ప్రియురాలు మృతదేహాన్ని రోడ్డున పడేశాడు.. పదేళ్లు డేటింగ్‌ తర్వాత దారుణం

Old Man Abandons Partner Body On Road: పదేళ్లు కలిసి బతికారు. అనారోగ్యంతో ప్రియురాలు మృతి చెందితే ఆమె అంత్యక్రియలు చేయలేని పరిస్థితిలో అతడు ఉన్నాడు. చివరకు మృతదేహాన్ని సంచిలో వేసి రోడ్డున వదిలేశారు. ఈ దారుణ సంఘటన అందరినీ కలచివేస్తోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 27, 2024, 11:13 PM IST
Last Rites: డబ్బుల్లేక ప్రియురాలు మృతదేహాన్ని రోడ్డున పడేశాడు.. పదేళ్లు డేటింగ్‌ తర్వాత దారుణం

Heart Breaking: ప్రేమ వారిద్దరినీ కలిపింది. వయసులో పెద్దవారైనా వారిద్దరూ పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేశారు. పదేళ్లు కలిసి మెలిసి బతికారు. అయితే ప్రియురాలు అనారోగ్యం కారణంగా చనిపోగా ఆమె ప్రియుడు దారుణంగా ప్రవర్తించాడు. ఆమె అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేక అమానుషానికి పాల్పడ్డాడు. మూడు రోజుల పాటు ఆమె మృతదేహాన్ని ఇంట్లో అలాగే ఉంచాడు. అయితే దుర్వాసన వెదజల్లడంతో దిక్కులేక గోనె సంచిలో ఆమె మృతదేహాన్ని కుక్కేశాడు. అనంతరం రోడ్డుపై తీసుకొచ్చి పడేశాడు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Also Read: POCSO Court: సొంత మనవరాలిపై తాతయ్య అఘాయిత్యం.. విశాఖ కోర్టు సంచలన తీర్పు

 

ఇండోర్‌కు సమీపంలోని చందన్‌నగర్‌లో మదన్‌ నర్గావే (53) నివసిస్తున్నాడు. అతడు పదేళ్ల నుంచి ఆశా నర్గవే (57) అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అయితే ఆ మహిళ అనారోగ్య సమస్యలతో శనివారం మృతి చెందింది. ఇంట్లోనే ఆమె మృతి చెందడంతో మృతదేహాన్ని అలాగే ఇంట్లో ఉంచాడు. రెండు రోజులుగా దుర్వాసన వస్తుండడంతో స్థానికులు అతడితో మాట్లాడారు. చివరకు సోమవారం దుర్వాసన భరించలేక మదన్‌ మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కాడు. అనంతరం సంచిని తీసుకెళ్లి నడిరోడ్డుపై పడేశాడు. ఇది చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మదన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read: Loan App: రూ.10 వేలకు రూ.లక్ష చెల్లించాలని వేధింపులు.. కట్టలేక కృష్ణా నదిలో దూకిన విద్యార్థి

 

సహజీవనం చేసిన ఆశా నర్గావే అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక ఇలా చేసినట్లు మదన్‌ పోలీసుల ముందు బాధపడ్డాడు. అయితే ఆశ అనారోగ్య సమస్యలతోనే చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో నిర్ధారణ అయ్యింది. ఆమె కాలేయం ఇతర వ్యాధులతో ఆమె బాధపడుతున్నారు. ఆ క్రమంలోనే ఆమె సహజ మరణం పొందారని ఏసీపీ నందిని శర్మ తెలిపారు. ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని చెప్పారు. విచారణ ముగిసిన అనంతరం పోలీసులు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించినట్లు అక్కడి స్థానిక చంద్‌నగర్‌ పోలీసులు తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News