Software Engineer: పదేళ్లు ప్రేమించిన ప్రియుడు ఓయో రూమ్‌కు రమ్మనడంతో వెళ్లిన ప్రేయసి..

Oyo Town House Fire: ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు పిలిస్తే ఓయో రూమ్‌కు ప్రేయసి వెళ్లింది. ఏ జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఆ యువతి రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉంది. తీరా ఆరా తీస్తే ప్రేమికుడే తుపాకీతో ఆమె కాల్చి హతమార్చాడని పోలీసుల విచారణలో తేలింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 29, 2024, 07:12 PM IST
Software Engineer: పదేళ్లు ప్రేమించిన ప్రియుడు ఓయో రూమ్‌కు రమ్మనడంతో వెళ్లిన ప్రేయసి..

Pune Software Engineer Killed: మహారాష్ట్రలోని పుణె నగర సరిహద్దులో ఉన్న ఓయో టౌన్‌ హోటల్‌లో శనివారం అకస్మాత్తుగా తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. కంగారు పడిన హోటల్‌ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా ఓ యువతి గదిలో మృతి చెంది ఉండగా.. గది మొత్తం రక్త మరకలతో నిండి ఉంది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. ప్రియుడే కాల్చి చంపినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయగా వాస్తవ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన వందన ద్వివేది, రిషబ్‌ నిగమ్‌ దాదాపు పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వందన పుణెలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటుండగా.. రిషబ్‌ మాత్రం ముంబైలో ఇవసిస్తున్నాడు. ఈనెల 25న రిషబ్‌, వందన కలుసుకున్నారు. వారిద్దరూ కలిసి పుణె శివారులోని పింప్రి చించ్‌వాడ్‌లో ఉన్న ఓయో టౌన్‌ హౌస్‌లో ఓ గదిలోకి దిగారు. కొద్దిసేపటికి గదిలో నుంచి తుపాకీ శబ్ధం వినిపించింది.

హోటల్‌ రికార్డులు పరిశీలించగా రిషబ్‌, వందన పేరు మీద గది బుక్‌ అయ్యింది. దీంతో రిషబ్‌ ప్రధాన నిందితుడిగా గుర్తించి విచారణ చేపట్టిన పోలీసులు రిషబ్‌ నిగమ్‌ను ముంబైలో పట్టుకున్నారు. అనంతరం అతడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కొన్నాళ్లుగా వందనతో రిషబ్‌ సహజీవనం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. కొన్నాళ్లుగా వందనపై అనుమానంతో ఉన్న రిషబ్‌ చివరకు అంతమొందించాడని వివరించారు. పక్కా ప్రణాళిక ప్రకారం రిషబ్‌ ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనలో విచారణ కొనసాగుతోందని.. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

Also Read: Mother Emotional Letter: కన్నా ప్రపంచంలోనే అత్యుత్తమ కొడుకివి నువ్వే రా.. కన్నీళ్లు తెప్పిస్తున్న తల్లి లేఖ

Also Read: RS Elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో 6 స్థానాలకు ఎన్నిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News