Inter Passed Cyber Criminal Looting Rs 5 to 10 cr daily: ఇదొక సినిమాటిక్ సైబర్ క్రైమ్ స్టోరీ. బ్లఫ్ మాస్టర్‌ని మించిన రియల్ క్రైమ్ స్టోరీ. సైబర్ నేరాల బాట పట్టిన దేశవ్యాప్తంగా వేలమంది అమాయక ప్రజలను.. ముఖ్యంగా మహిళలనే లక్ష్యంగా చేసుకొని కోట్ల రూపాయలు దోచుకుంటున్న తెలుగు సైబర్ నేరగాడిని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి పేరు దాడి శ్రీనివాసరావు. అతడి వయస్సు 49 ఏళ్లు. చదివింది పన్నెండో తరగతి వరకే కానీ.. సైబర్ నేరాల్లో మహా ముదురు. రోజుకు రూ.5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు మోసాలకు పాల్పడే రేంజ్‌కి ఎదిగాడు అంటే ఈ బ్లఫ్ మాస్టర్ మైండ్ ఎంత క్రిమినల్ మైండో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
దాడి శ్రీనివాస్ రావు స్వస్థలం విశాఖపట్నం జిల్లా పెందుర్తి. కానీ ఎవ్వరికీ అనుమానం రాకుండా గత 15 ఏళ్లుగా హైదరాబాద్‌లోనే కుటుంబంతో సహా మకాం పెట్టి తన సైబర్ నేరాలు కొనసాగిస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఎంతోమందిని మోసం చేస్తున్న ఈ సైబర్ క్రిమినల్ ని వల వేసి పట్టుకున్న ముంబై పోలీసులు.. అతడు విశాఖపట్నంలోని నోవోటెల్ హోటల్లో కుటుంబంతో సహా ఉన్నాడని స్పష్టమైన సమాచారంతో ముంబైలోని బాంగుర్ నగర్ పోలీసులు మెరుపు దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కి తరలించి కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఆ తరువాత ట్రాన్సిట్ రిమాండ్ మీద అతడిని ముంబైకి తీసుకువెళ్లారు. ఈ ముఠాకు చెందిన మరో నలుగురు కేటుగాళ్లను కూడా ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు మహారాష్ట్రలోని థాణాకు చెందిన వారు కాగా మిగతా ఇద్దరు కోల్‌కతా వాసులు ఉన్నారు.
దాడి శ్రీనివాస రావు సైబర్ నేరాలన్ని టెలిగ్రామ్ యాప్ ద్వారానే మొదలుపెడతాడు. ఎవరితోనైనా కేవలం టెలిగ్రామ్ యాప్ ఉపయోగించే సంప్రదింపులు జరుపుతాడు. ఇప్పటివరకు దాడి శ్రీనివాస్ రావు లావాదేవీలు జరుపుతున్న 40 బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు. అతడి నుంచి రూ.1.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సైబర్ ముఠా ఎక్కువ శాతం మహిళలనే లక్ష్యంగా చేసుకుంటోంది.
మోడస్ ఆపరేషన్ ఏంటంటే...
ముందుగా ఆ మహిళలకు ఫోన్ చేసే శ్రీనివాస్ రావు అండ్ గ్యాంగ్.. తమని తాము పోలీసు అధికారులం అని చెప్పి పరిచయం చేసుకుంటుంది. మీ పేరిట వచ్చిన కొరియర్లో మాదకద్రవ్యాలు లేదా ఆయుధాలు వంటివి లభించాయి అని బెదిరిస్తారు. ఆ కొరియర్ మీది కాదు అని నిరూపించుకోవాలంటే వెంటనే బ్యాంకు ఎకౌంట్, ఆదాయపు పన్ను వివరాలు పంపాలని హుకూం జారీచేస్తారు. మీరు పంపించిన వివరాలను తనిఖీ చేసి ఆ కొరియర్‌తో మీకు సంబంధం ఉందా లేదా అనే విషయం తేలుస్తామని.. అప్పటి వరకు తాము చెప్పినట్టు చేయాల్సిందే" అని చెప్పి పోలీసుల ముసుగులో డ్రామా మొదలుపెడతారు.
పోలీసులం అని ఫోన్ చేసి టెన్షన్ పెట్టడంతో అది నిజమే అని నమ్మిన మహిళలు.. ఆ నేరంతో తమకు ఎలాంటి సంబంధం లేదు అని తేల్చుకోవడం కోసం వెంటనే ముందు, వెనుకా ఆలోచించకుండా పోలీసులకే చెబుతున్నాం అనుకుని వాళ్లు అడిగిన వివరాలు అన్నీ చెప్పేస్తున్నారు. వెరిఫికేషన్ పేరిట శ్రీనివాస్ రావు గ్యాంగ్ అడిగే ఓటీపీని కూడా షేర్ చేయడంతో ఆ ఓటిపి సహాయంతో సదరు మహిళల బ్యాంక్ ఎకౌంట్స్ ఖాళీ చేయడం శ్రీనివాస్ రావు అండ్ గ్యాంగ్ కి పని సులువు అవుతోంది.
ఇది కూడా చదవండి : Beautiful Girls For Enjoyment: స్నేహం, సరదాల కోసం అందమైన అమ్మాయిలు.. 71 ఏళ్ల వృద్ధుడికి లక్షల్లో టోకరా
అలా శ్రీనివాస్ రావు చేతిలో దేశవ్యాప్తంగా వేల మంది మహిళలు మోసపోయారు. మహిళలను సులువుగా మోసం చేయొచ్చనే భావనతోనే శ్రీనివాస్ రావు వారిని టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. బాధితుల నుంచి శ్రీనివాస్ రావు దోచుకున్న సొమ్మంతా అతడికి సంబంధించిన 40 బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అలా రోజుకు రూ. 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు దోచుకుంటున్న శ్రీనివాస్ రావు.. దోచుకున్న ఆ మొత్తాన్ని క్రిప్టోకరెన్సీలోకి మారుస్తున్నాడు. ఇంటర్ చదివిన దాడి శ్రీనివాస్ రావు చేస్తున్న సైబర్ నేరాలు చూసి షాక్ అవడం ముంబై పోలీసుల వంతయ్యింది. దేశవ్యాప్తంగా ఎంతోమందిని దోచుకున్న ఈ తెలుగోడి నేరాలను ముంబై పోలీసులు వచ్చి అతడిని అరెస్ట్ చేసే వరకు ఇక్కడ కూడా ఎవ్వరికీ అనుమానం రాకపోవడం గమనార్హం.
ఇది కూడా చదవండి : Took Poison On Instagram: ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో సూసైడ్.. లొకేషన్ ట్రేస్ చేసి హడావుడిగా పరుగెత్తిన పోలీసులు
ఇది కూడా చదవండి : How to Prevent Cyber Crimes: సైబర్ నేరాల నియంత్రణకు అవగాహన కల్పిస్తూ కేంద్రం తీసుకున్న చర్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK