Kothagudem Road Accident: ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళుతుండగా ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

Four Killed in Road Accident: ప్రీ వెడ్డింగ్ షూట్‌కు లోకేషన్ల కోసం వెళుతూ.. రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఇల్లెందు-మహబూబాబాద్‌ మధ్య కోటిలింగాల వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు ఇలా..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2023, 08:38 AM IST
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • నలుగురు యువకులు మృతి, ఒకరికి గాయాలు
  • ప్రీ వెడ్డింగ్‌ షూట్‌కు వెళుతుండగా ప్రమాదం
Kothagudem Road Accident: ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళుతుండగా ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

Four Killed in Road Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌కు వెళుతుండగా.. కారు-లారీ ఢీకొని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇల్లెందు-మహబూబాబాద్‌ మధ్య కోటిలింగాల వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలంలోనే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించాడు. మరొకరికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. 

మహబూబాబాద్‌ వైపు నుంచి ఇల్లెందుకు వెళుతున్న కారు.. ఇల్లెందు నుంచి మహబూబాబాద్‌ వైపు వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తో పాటు ముగ్గురు యువకులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన ఇద్దరు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. మృతులను వరంగల్ జిల్లాకు చెందిన బైరి రాము, బాసబత్తిని అరవింద్‌, రిషీ, కళ్యాణ్‌గా గుర్తించారు. రణధీర్‌ అనే యువకుడు ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

మృతులంతా 30 నుంచి 35 ఏళ్లలోపు వారేనని పోలీసులు చెబుతున్నారు. వీరంతా ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో లోకేషన్లు గుర్తించేందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి నలుగురు యువకులు మృతి చెందడంతో వరంగల్ పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read: IND VS NZ: నేడే రెండో వన్డే.. కోహ్లీని ఊరిస్తున్న మరో రికార్డు  

Also Read: Hyper Aadi: 2024లో జనసేన ప్రభుత్వం.. సినిమాటోగ్రఫీ మంత్రిగా హైపర్ ఆది.. పోస్టులు వైరల్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News