Fake CBI Officers: సీబీఐ ఆఫీసర్ల అవతారం ఎత్తిన ఇద్దరు కేటుగాళ్లు ఓ వ్యక్తి నుంచి రూ. 11 లక్షలు చోరీ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ ఇద్దరు నిందితులు వేర్వేరు వ్యక్తులు కాదు.. ఒకరు స్వయంగా తండ్రి కాగా మరొకడు అతడి కొడుకే. అవును.. తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి సీబీఐ ఆఫీసర్లం అని చెప్పి బెదిరించి మరీ చోరీకి పాల్పడ్డారు. నిందితులను ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌కి చెందిన మహ్మద్ ఇంత్‌జార్ (47), అతడి కొడుకు మహ్మద్ యూసుఫ్ (19) గా గుర్తించారు.
ఇంతకీ చోరీ ఎలా జరిగింది.. ఎలా దొరికిపోయారంటే..
నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ సమీపంలోని సరై కలె ఖావ్ ఫ్లైఓవర్ సమీపంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. ఓ వ్యక్తి చోర్ చోర్ అని బిగ్గరగా అరవడం వారికి వినిపించింది. వెంటనే పోలీసులు అటువైపు పరుగెత్తగా ఇద్దరు వ్యక్తులు ఒక బ్యాగ్ తీసుకుని పరుగెత్తుతుండటం.. వారిని వెంబడిస్తూ మరో వ్యక్తి పరుగెత్తడం కనిపించింది. కొద్దిసేపు చేజ్ చేసి బ్యాగ్‌తో పరుగెత్తుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. అంతలోనే వారిని వెంబడిస్తున్న వ్యక్తి కూడా అక్కడికి చేరుకున్నాడు. ఆ ఇద్దరు వ్యక్తుల వద్ద ఉన్న బ్యాగ్ తీసుకుని చూస్తే దానినిండా క్యాష్ ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అక్షరాల 11 లక్షలు. ఏం జరిగింది అని పోలీసులు అరా తీస్తే అసలు విషయం తెలిసింది.
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ రాజేశ్ దేవ్ మీడియాతో మాట్లాడుతూ.. బాధితుడు తను పనిచేసే చోట బాస్ ఇచ్చిన రూ. 11 లక్షల క్యాష్ బ్యాగ్ తో వెళ్తుండగా వెనకాలే వచ్చిన ఇద్దరు వ్యక్తులను తమను తాము సీబీఐ ఆఫీసర్లుగా పరిచయం చేసుకున్నారు. బ్యాగులో ఏం ఉందని సోదా చేశారు. అందులో ఒక వ్యక్తి అధికారికంగా తీసుకెళ్లాల్సిన దానికంటే ఎక్కువ మొత్తంలో నగదు ఉన్నందున నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అంటూ ఓ ఆటో ఎక్కించుకున్నారు.
ఆటోలో బాధితుడిని ఎక్కించుకుని ఐటిఓలో ఉన్న తమ ఫేక్ సీబీఐ ఆఫీసుకు తీసుకెళ్తున్నట్టు నాటకమాడారు. కానీ ఆటో సరై కలే ఖావ్ వద్దకు వచ్చేటప్పటికీ బాధితుడి వద్ద బ్యాగుని చోరీ చేసి ఆటో దిగి పరుగెత్తడం ప్రారంభించారు. ఆ సమయంలోనే బాధితుడు ఆటో దిగి వారిని వెంబడిస్తూ చోర్ చోర్ అని అరవడం.. ఆ అరుపులు విని ఢిల్లీ పోలీసులు వారిని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అలా ఫేక్ సీబీఐ ఆఫీసర్స్ గెటప్‌లో ఉన్న తండ్రి, కొడుకు ఇద్దరూ అరెస్ట్ అయ్యారు.
ఇది కూడా చదవండి : Best Selling Hatchbacks: ఎక్కువగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే
ఇది కూడా చదవండి : PM Svanidhi Yojana: ఈ లోన్ తీసుకుంటే నయాపైస వడ్డీ లేదు.. గ్యారెంటీ అసలే లేదు..
ఇది కూడా చదవండి : Small Savings Schemes: బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే ఈ వడ్డీ రేట్లే ఎక్కువ
ఇది కూడా చదవండి : Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డుపై ఫోటో మార్చుకోవడం ఎలా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook