Making Liquor from Medicines: కాదేది కవితకు అనర్హం అన్న చందంగానే ఉన్నాయి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించే వాళ్లకు వచ్చే ఉపాయాలు కూడా. ఇప్పటివరకు బెల్లం నుంచి సారా తయారీ చేయడం చూశాం.. బీరు తయారీకి రేషన్ బియ్యం ఉపయోగించడం గురించి విన్నాం.. కానీ వీడు ఏకంగా మెడిసిన్స్ నుంచే మద్యం తయారు చేస్తున్నాడు. చదివిందేమో డాక్టర్ చదువు.. చేస్తోందేమో ఇలాంటి అడ్డదిడ్డమైన ఆవారా పనులు. అయినా.. ఔషదాలు ఉపయోగించి మద్యం తయారు చేయడం ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా ? అయితే ఇదిగో బీహార్‌లోని వైశాలిలో ఎక్సైజ్ పోలీసులకు చిక్కినట్టే చిక్కి మళ్లీ వాళ్ల కళ్లుగప్పి పరారైన ఈ డాక్టర్ కమ్ ఫ్రాడ్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే.
వైశాలి జిల్లా సదర్ పోలీసు స్టేషన్ పరిధిలో సుభాయి గ్రామంలో సురేష్ కుమార్ అనే డాక్టర్ మెడిసిన్స్ ఉపయోగించి నకిలీ మద్యం తయారు చేస్తున్నాడని స్పష్టమైన సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు... స్థానిక పోలీసుల సహాయంతో అతడి నివాసంపై ఆకస్మిక తనిఖిలు నిర్వహించారు. ఈ సోదాల్లో అతడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సుమారు రెండు డజెన్లకుపైగా ఎక్సైజ్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసు సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు.
గురువారం రాత్రి సురేష్ కుమార్‌ని అరెస్ట్ చేసి సదర్ పోలీసు స్టేషన్‌కి తీసుకొచ్చిన పోలీసులు.. అతడి చేతులు కట్టేసి మీడియా ఎదుట హాజరుపరిచారు. మీడియా వాళ్లు సైతం అతడి నుంచి ఆసక్తికరమైన వివరాలు రాబట్టారు. ఔషదాల నుండి మద్యం ఎలా తయారు చేస్తున్నావు అని మీడియా ప్రశ్నించగా.. వారికి మొత్తం సీన్ పూసగుచ్చినట్టు ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఫేక్ లిక్కర్ తయారీ దొంగ దొరికాడు.. ఇక కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టుకు అప్పగించడమే అని పోలీసులు భావిస్తున్న సమయంలోనే సురేష్ కుమార్ వారికి గట్టి జలక్ ఇచ్చాడు.
పోలీసులు అరెస్ట్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్న సమయంలోనే సురేష్ కుమార్ అదును చూసుకుని స్టేషన్ నుంచి పరారై రాత్రి పూట చీకట్లో కలిసిపోయాడు. లిక్కర్ మేకర్ తమ కస్టడీలోనే ఉన్నాడు కదా అని పోలీసులు లైట్ తీసుకున్నారు కానీ.. నిందితుడు మాత్రం తప్పించుకునేందుకు రైట్ టైమ్ కోసం వెయిట్ చేస్తున్నాడని అప్పటి వరకు పోలీసులు కూడా గ్రహించలేకపోయారు. తమ కస్టడి నుంచి పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది ఆ రాత్రంతా వెదికినా ప్రయోజనం లేకపోయింది. సురేష్ కుమార్ స్వగ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న పంట పొలాల్లోనూ అతడి ఆచూకీ కోసం జల్లెడ పట్టారు. అయినా సురేష్ కుమార్ మాత్రం దొరకలేదు. దీంతో మెడిసిన్స్ నుంచి లిక్కర్ తయారీ కేసుతో పాటు కస్టడీ నుంచి పరారైన నేరం కింద కూడా మరో కేసు నమోదు చేసిన పోలీసులు.. సురేష్ కుమార్ కోసం వేట కొనసాగిస్తున్నారు.
Also Read : Faulty Oximeter: పనిచేయని ఆక్సీమీటర్ శవానికి పెట్టి.. బతికే ఉన్నాడని 18 నెలలు శవాన్ని ఇంట్లో పెట్టుకుని..
Also Read : Man Shoots Girlfriend: గాళ్‌ఫ్రెండ్‌ని గన్‌తో కాల్చి పారిపోబోయాడు.. ఇంతలోనే..
Also Read : Man Buried Alive: పైసల కోసం ప్రాణం ఉండగానే యువకుడిని పాతిపెట్టారు
Also Read : Kidneys Theft: ఆస్పత్రికి వెళ్లిన మహిళ రెండు కిడ్నీలు మాయం.. అవయవాల దొంగల ముఠా పనేనా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి