Chhattisgarh Road Accident Latest Updates: ఛత్తీస్‌ఘడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కబీర్‌ధామ్ జిల్లా కుక్‌దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పికప్ వ్యాన్ బోల్తా పడటడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించిన వారంతా కూలీలేనని.. టెండు ఆకులు తెంపుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కూలీలను తీసుకుని వస్తుండగా.. అదుపుతప్పి పికప్ వ్యాన్ బోల్తా పడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. అయితే మృతులు ఎవరో ఇంకా గుర్తించలేదు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Also Read: Srikanth: బర్త్-డే పార్టీలు తప్ప.. రేవ్ పార్టీలు నాకు తెలియదు: శ్రీకాంత్
ప్రమాదం జరిగిన సమయంలో పికప్ వ్యానులో మొత్తం 22 మంది ఉన్నారు. కూలీలు అందరూ టెండు ఆకులు తీసి.. తిరిగి పికప్ వ్యాన్‌లో వస్తున్నారు. ఈ క్రమంలో వ్యాను అదుపు తప్పి 20 అడుగుల లోతు గుంతలో పడిపోయింది. కూలీలు అందరూ బహపానీ గ్రామ నివాసితులుగా తెలుస్తోంది. మృతుల్లో 15 మంది మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఎస్పీ అభిషేక్ పల్లవ్ మాట్లాడుతూ.. ప్రమాద ఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారని తెలిపారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
కొంతమంది వ్యానుపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇక ఈ ప్రమాదం తరువాత మృతదేహాలు రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రమాద ఘటనపై సీఎం విష్ణుదేవ్ విచారం వ్యక్తం చేశారు. కబీర్‌ధామ్ జిల్లా కుక్‌దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహ్పానీ గ్రామ సమీపంలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లా యంత్రాంగానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Read more: IPL 2024 RR vs KKR: రాజస్థాన్ ఆశలపై నీళ్లు.. వర్షం కారణంగా కేకేఆర్‌తో మ్యాచ్ రద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter