Tamil Nadu's spurious liquor toll rise: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. విల్లుపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లో కల్తీ మద్యం సేవించి మృతి చెందినవారి సంఖ్య 17కు చేరింది. విల్లుపురం జిల్లా మరక్కనం సమీపంలోని ఎక్కియార్‌కుప్పంకు చెందిన 12 మృతి చెందగా.. చెంగల్‌పట్టు జిల్లాలోని మదురాంతగంలో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కల్తీ మద్యం తీసుకోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం 30మందికిపైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసు అధికారులు తెలిపారు. మృతి చెందిన వారు ఇథనాల్-మిథనాల్ పదార్థాలతో కూడిన కల్తీ మద్యం సేవించి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. అతని వద్ద నుండి కల్తీ మద్యాన్ని స్వాధనం చేసుకున్నారు. అందులో మిథనాల్ ఉనికిని నిర్ధారించడానికి దానిని ల్యాబ్‌కు పంపారు. బాధితుల్లో కొంత మంది చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.
రెండు ఘటనలకు కారణమైన కొందరు పరారీలో ఉన్నారని.. నిందుతులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన అధికారులపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు ఐజీ ఎన్ కన్నన్ తెలిపారు. విల్లుపురం మరక్కాణంలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేశామని... అలాగే చెంగల్పట్టు ఘటనకు సంబంధించి ఒక ఇన్‌స్పెక్టర్, ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేసినట్లు ఐజీ తెలిపారు.
రాష్ట్రంలో మద్యం సేవించడం వల్ల మరణాలు సంభవించడం బాధాకరమన్నారు సీఎం స్టాలిన్. మృతుల కుటుంబానికి రూ.10 లక్షలు, ఆస్పత్రిలో చేరిన వారికి రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Also Read: Karnataka Results 2023: కర్ణాటకలో ఊహించని పరిణామాలు, కాంగ్రెస్ గాలిలో ఓడిన 11 మంది మంత్రులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook